Vijay Deverakonda: డేటింగ్ చేయాలని ఉందన్న సారా అలీఖాన్.. మొదటిసారి స్పందించిన రౌడీ హీరో

ABN , First Publish Date - 2022-08-10T19:56:21+05:30 IST

ఎటువంటి సపోర్టు లేకుండా టాలీవుడ్‌లో పాపులారిటీ సాధించిన నటుడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా మారిన..

Vijay Deverakonda: డేటింగ్ చేయాలని ఉందన్న సారా అలీఖాన్.. మొదటిసారి స్పందించిన రౌడీ హీరో

ఎటువంటి సపోర్టు లేకుండా టాలీవుడ్‌లో పాపులారిటీ సాధించిన నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా మారిన ఈ నటుడు ‘అర్జున్ రెడ్డి’ మూవీతో స్టార్‌గా మారిపోయాడు. ఈ మూవీతో విజయ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఆ మూవీలో ఆయన అగ్రెసివ్ యాటిట్యూడ్‌కి ఎంతోమంది ఫ్యాన్స్‌గా మారిపోయారు. అందులో.. బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్స్ సైతం ఆయన అభిమానుల్లో ఉన్నారు. అందులో.. అందాల తారలు సారా అలీఖాన్ (Sara Ali Khan), జాన్వీ కపూర్ కూడా ఉన్నారు.


ఈ అందాలతారలు తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ అతిథులుగా వచ్చారు. ఈ షోకి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తన షోకి గెస్టులుగా వచ్చిన ఈ జాన్వీని, సారాని ఎన్నో చిత్రమైన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాడు. అందులో భాగంగా సారాతో మాట్లాడుతూ.. ‘నీకు ఎవరితో డేటింగ్ చేయాలని ఉంది?’ అని కరణ్ అడిగాడు. దానికి.. విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉందని సారా చెప్పుకొచ్చింది. దీని సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది. ఈ డేటింగ్ కామెంట్స్ పై తాజాగా విజయ్ దేవరకొండ స్పందించాడు.


విజయ్, పూరీ జగన్నాథ్ కాంబోలో ‘లైగర్(Liger)’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియాలో స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సారాతో డేటింగ్‌పై విజయ్ స్పందించాడు.


అందులో విజయ్ మాట్లాడుతూ.. ‘సారా అలా అనడం చాలా నచ్చింది. నాకు ఆమె ఎఫెక్షన్ అర్థమైంది. అలాగే నేను తనకి మేస్సేజ్ కూడా చేసి థ్యాంక్స్ చెప్పాను. తను చాలా స్వీట్. అందుకే నా గురించి అలా మాట్లాడగలిగింది’ అని చెప్పుకొచ్చాడు. అలాగే సారాతో డేటింగ్ చేస్తారా అనే ప్రశ్నకి.. ‘లేదు. నాకు రిలేషన్‌షిప్స్ మీద అంతా ఇంట్రస్ట్ లేదు’ అని తెలిపాడు. అదే సమయంలో రిలేషన్‌షిప్ అనే పదం పలకడానికి కొంచెం ఇబ్బంది పడ్డాదు. దాన్నే కామెడీ వాడుకుంటూ.. ‘నాకు రిలేషన్‌షిప్ అనే పదమే పలకడం రావట్లేదు. అలాంటి ఎలా డేటింగ్ చేయగలను’ అని విజయ్ ప్రశ్నించాడు.

Updated Date - 2022-08-10T19:56:21+05:30 IST