Vijay Deverakonda: ‘జనగణమన’ పై సమాధానం దాట‌వేసిన హీరో

ABN , First Publish Date - 2022-09-12T00:43:39+05:30 IST

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్’ (Liger) తో భారీ పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను

Vijay Deverakonda: ‘జనగణమన’ పై సమాధానం దాట‌వేసిన హీరో

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్’ (Liger) తో భారీ పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. ఈ మూవీ విడుదలకు ముందే పూరీతో మరో ప్రాజెక్టుకు విజయ్ పచ్చ జెండా ఊపాడు. ‘జనగణమన’ (Jana Gana Mana)అని టైటిల్ అనౌన్స్ చేశాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే, కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. కానీ, చిత్ర బృందం నుంచి మాత్రం అధికారికంగా ప్రకటన వెలువడలేదు. 


జనగణమన సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ (Pooja Hegde) గా నటిస్తుంది. తాజాగా సైమా అవార్డ్స్‌కు విజయ్ హాజరు అయ్యాడు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి విజయ్ నిరాకరించాడు. సైమా గురించి మాట్లాడి వేడుకను ఎంజాయ్ చేయాలని కోరాడు. ప్రస్తుతం విజయ్ ‘ఖుషి’ (Kushi) చేస్తున్నాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ క్రిస్‌మస్ కానుకగా థియేటర్స్‌లోకి రానుంది. ‘లైగర్’ మిక్స్‌డ్ మార్షల్ నేపథ్యంలో రూపొందింది. అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, మైక్ టైసన్, మర్కంద్ దేశ్ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాలను మిగిల్చింది.     

Updated Date - 2022-09-12T00:43:39+05:30 IST