Vijay Deverakonda: ఎవడిమాటా వినేదే లేదు.. కొట్లాడదాం

ABN , First Publish Date - 2022-08-20T23:19:11+05:30 IST

‘లైగర్’ (Liger) చిత్రంతో పాన్ ఇండియా (Pan India) స్టార్‌గా మారబోతున్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అట్టహాసంగా

Vijay Deverakonda: ఎవడిమాటా వినేదే లేదు.. కొట్లాడదాం

‘లైగర్’ (Liger) చిత్రంతో పాన్ ఇండియా (Pan India) స్టార్‌గా మారబోతున్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అట్టహాసంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే బాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో ఏ సినిమా విడుదల అవుతున్నా.. ‘బాయ్‌‌కాట్’ హ్యాష్ ట్యాగ్‌తో కొందరు సోషల్ మీడియాలో అల్లరల్లరి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ‘లైగర్’ చిత్రానికి బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ పరంగా ‘బాయ్‌కాట్‌లైగర్’ (#BoycottLiger) ట్యాగ్ వైరల్ అవుతోంది. ఈ హ్యాష్ ట్యాగ్‌కి వ్యతిరేకంగా.. విజయ్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ‘ఐసపోర్ట్‌లైగర్’ (#ISupportLiger), ‘అన్‌స్టాపబుల్‌లైగర్’ (#UnstoppableLiger) ట్యాగ్స్‌తో ఎదురుదాడి చేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న విజయ్ కూడా.. సోషల్ మీడియా వేదికగా స్పందించి.. తన అభిమానులకు మరింత హుషారునిచ్చారు. 


‘‘మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు

మన ధర్మం మనం చేసినప్పుడు

ఎవడిమాటా వినేదే లేదు..

కొట్లాడదాం..’’ అంటూ ఫైర్ ఎమోజీని, అలాగే లైగర్ ట్యాగ్‌ని పోస్ట్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు.. ‘యాటిట్యూడ్ కింగ్’.. ‘ఈ సమయంలో వీరులంతా చెప్పేది ఏమిటంటే.. పద చూసుకుందాం’.. ‘పద కొట్లాడదాం’ అంటూ విజయ్ ట్వీట్స్‌కి కామెంట్స్ చేస్తున్నారు. అలాగే.. బాయ్‌కాట్‌లైగర్‌కి బుద్ది చెప్పినట్లయిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. కాగా, విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై.. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న  ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో విడుదల కానుంది.



Updated Date - 2022-08-20T23:19:11+05:30 IST