అతివిశ్వాసమే.. ఆ హీరో కొంపముంచుతుందా?

ABN , First Publish Date - 2022-06-07T02:29:55+05:30 IST

కెరియర్ స్టార్ట్ అయిన ఆరేళ్లలో 10 సినిమాలు చేసిన విజయ్, అందులో క్లీన్ హిట్స్ మూడు మాత్రమే. ఒకటి యావరేజ్ సినిమా, మిగిలిన ఆరు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్లాప్‌గా మిగిలాయి. 2018 నుండి విజయ్ 6 సినిమాలు చేస్తే, అందులో

అతివిశ్వాసమే.. ఆ హీరో కొంపముంచుతుందా?

టాలీవుడ్ ఫ్యూచర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇప్పుడు విజయ్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కెరియర్ స్టార్ట్ అయిన ఆరేళ్లలో 10 సినిమాలు చేసిన విజయ్, అందులో క్లీన్ హిట్స్ మూడు మాత్రమే. ఒకటి యావరేజ్ సినిమా, మిగిలిన ఆరు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్లాప్‌గా మిగిలాయి. 2018 నుండి విజయ్ 6 సినిమాలు చేస్తే, అందులో ‘గీత గోవిందం’ (Geetha Govindham) మాత్రమే విజయవంతమైన సినిమాగా నిలిచింది. ఆ సినిమా స్పూర్తితోనే విజయ్.. తన మార్కెట్‌ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. 


ఆ జోష్‌లోనే అతివిశ్వాసంతో.. ‘డియర్ కామ్రేడ్ (Dear Comrade), వరల్డ్ ఫేమస్ లవర్ (World Famous Lover)’ అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. వీటిలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రమైతే విజయ్ అభిమానులే తలపట్టుకునే పరిస్థితిని కల్పించింది. ఈ సినిమాలతో విజయ్ మార్కెట్ కూడా పడిపోయింది. విజయ్ లుక్స్ అండ్ యాక్టింగ్‌లో మొనాటమి వచ్చేసింది అనే విమర్శ కూడా వచ్చింది. అవే లవ్ స్టోరీస్, అదే యాక్టింగ్... ఇలానే కంటిన్యూ అయితే విజయ్ కెరియర్ క్లోజ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదనే మాట కూడా వినిపించింది. 


విజయ్ (Vijay) ప్రస్తుతం మూడు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెట్టాడు. అందులో రెండు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ (Puri Jagannadh)తోనే కావడం విశేషం. మిగిలిన ఒక సినిమా ‘ఖుషి’ (Kushi) అనే టైటిల్‌తో శివ నిర్వాణ (Shiva Nirvana) డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే, పూరి ఎప్పుడు హిట్ ఇస్తాడో, ఎప్పుడు ఫ్లాప్ ఇస్తాడో ఆయనకే తెలియదు. ఇక శివ నిర్వాణ పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్‌ని మెప్పిస్తాడా? అంటే ఏమో అనే డౌటే వస్తుంది. 


అయితే మూడేళ్లు నుండి హిట్టు సినిమా లేని విజయ్.. ముందుగా టాలీవుడ్‌లో ఒక హిట్ కొట్టి... తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేస్తే బాగుండేది. ఇప్పుడు చేస్తున్న ఈ మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కనుక తేడా కొడితే.. విజయ్ కెరియర్ ఏమవుతుందో అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ ఈ మూడు సినిమాలు హిట్ అయితే మాత్రం.. ఇక అతను ఫ్యూచర్ స్టార్ కాదు.. పాన్ ఇండియాలో తిరుగులేని స్టార్ అవడం ఖాయం.

Updated Date - 2022-06-07T02:29:55+05:30 IST