Liger: అక్కడ ఒకరోజు ఆలస్యంగా విడుదల

ABN , First Publish Date - 2022-08-21T02:22:56+05:30 IST

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannadh కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’ (Liger). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 25న విడుదల కాబోతున్నట్లుగా ఇప్పటి వరకు

Liger: అక్కడ ఒకరోజు ఆలస్యంగా విడుదల

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’ (Liger). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 25న విడుదల కాబోతున్నట్లుగా ఇప్పటి వరకు మేకర్స్ చెబుతూ వచ్చారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదలపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ‘లైగర్’ చిత్రం హిందీ బెల్ట్‌లో ఒకరోజు ఆలస్యంగా విడుదల చేయాలని.. మేకర్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మేకర్స్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే దానిపై క్లారిటీ లేదు కానీ.. హిందీ మినహా.. ఇతర భాషల్లో ఈ చిత్రం.. మొదటి నుంచి చెప్పినట్లుగానే ఆగస్ట్ 25న విడుదల కాబోతున్నట్లుగా మాత్రం తెలుస్తుంది. అయితే హిందీ విడుదల విషయంపై మేకర్స్ నుండి అధికారిక సమాచారం మాత్రం రాలేదు. 


ప్రస్తుతం బాలీవుడ్‌లో బాలీవుడ్ స్టార్స్ నటించిన చిత్రాలేవీ విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. ఆమిర్ ఖాన్ (Aamir Khan) వంటి స్టార్ చిత్రానికి కూడా షోస్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పాన్ ఇండియా చిత్రాలు కూడా.. విడుదలైన మొదటి రోజు దారుణమైన కలెక్షన్లు రాబడుతున్నాయి. కంటెంట్ బాగుండి.. కాస్త మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉంటే మాత్రమే.. థియేటర్లకి ప్రేక్షకులు వస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘కార్తికేయ2’ (Karthikeya 2) చిత్రం మొదటి రోజు కేవలం రూ. 7 లక్షలు మాత్రమే వసూలు చేసింది. తర్వాత ఆ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్‌తో సినిమా ఇప్పుడక్కడ బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలు కూడా తీసేసి.. ‘కార్తికేయ2’కి స్ర్కీన్స్ ఇస్తుండటంతో.. ఈ సినిమాకి రికార్డ్ కలెక్షన్లు అక్కడ వసూలవుతున్నాయి. 


మరి దీనిని గమనించి.. ‘లైగర్’ టీమ్ అలాంటి డెసిషన్ ఏమైనా తీసుకున్నారా? మిగతా భాషల్లో పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత.. బాలీవుడ్‌లో వదిలి.. ‘లైగర్’ వేటని షురూ చేయాలని మేకర్స్ ఇలాంటి నిర్ణయానికి పూనుకుని ఉంటారా? ఏ విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. 

Updated Date - 2022-08-21T02:22:56+05:30 IST