Vijay Deverakonda: ‘ది లైగర్ హంట్ థీమ్’ విడుదల

ABN , First Publish Date - 2022-05-09T22:34:52+05:30 IST

సంచలన హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)- డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‪లో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ (Liger). ‘సాలా క్రాస్‌బ్రీడ్’

Vijay Deverakonda: ‘ది లైగర్ హంట్ థీమ్’ విడుదల

సంచలన హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)- డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‪లో  తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ (Liger). ‘సాలా క్రాస్‌బ్రీడ్’ అనేది ఉప శీర్షిక. విజయ్ దేవరకొండ పుట్టినరోజు(మే 9)ను పురస్కరించుకుని చిత్ర యూనిట్ లైగర్ హంట్ థీమ్ (Liger Hunt Theme) లిరికల్ వీడియోను విడుదల చేసింది. ఈ హంట్ థీమ్‪లో విజయ్ దేవరకొండ వేటాడే సింహంలా కనిపిస్తున్నారు. విజయ్ లుక్, యాక్షన్ నెక్స్ట్ లెవల్‪లో వున్నాయి. సిక్స్ ప్యాక్ దేహంతో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌‪ని ప్రాక్టీస్ చేస్తూ ఒక యూనివర్సల్ స్టార్‪లా కనిపించారు విజయ్ దేవరకొండ. వీడియోతో పాటు విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ కూడా ఫ్యాన్స్‪ని ఆకట్టుకునేలా ఉంది. ఈ పోస్టర్‪లో విజయ్ దేవరకొండ లుక్ స్టన్నింగ్‪గా వుంది. సిక్స్ ప్యాక్ దేహంతో బాక్సింగ్ రింగ్‪లో శత్రువుని మట్టికరిపించే యోధుడిలా కనిపించారు. ఈ హంట్ థీమ్‪ని విక్రమ్ మాంట్రోస్ (Vikram Montrose) కంపోజ్ చేయగా.. హేమచంద్ర (Hemachandra) ఫుల్ ఎనర్జీటిక్‪గా పాడారు. భాస్కరభట్ల (Bhaskarabhatla) సాహిత్యం అందించారు.


‘‘బతకాలంటే గెలవాల్సిందే

ఎగరాలంటే రగలాల్సిందే

నువ్వు పుట్టిందే గెలిచెటందుకు

దునియా చమడాల్ వలిచెటందుకు

అది గుర్తుంటే ఇంకేం చూడకు

ఎవడు మిగలడు ఎదురుపడెందుకు

ఛల్ లైగర్.. హంట్..’’


అంటూ సాగిన ఈ హంట్ థీమ్ తో ప్రతి ఒక్కరిలో ఉత్తేజాన్ని కలిగించేలా భాస్కరభట్ల తన పెన్ పవర్ ని ప్రదర్శించారు. మొత్తానికి ఈ లైగర్ హంట్ థీమ్ సినిమాపై మరింతగా అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‪లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే (Ananya Pandey) కథానాయికగా కనిపిస్తుండగా.. లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson) ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. పూరి కనెక్ట్స్ (Puri connects) , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ (Charmme Kaur), కరణ్ జోహర్ (Karan Johar), అపూర్వ మెహతా (Apoorva Mehta) సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విష్ణు శర్మ (Vishnu Sarma) సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌ (Thailand)కు చెందిన కెచా (Kecha) స్టంట్ మాస్టర్‪గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Updated Date - 2022-05-09T22:34:52+05:30 IST