Boycott Liger: అది మా మూడేళ్ల కష్టం.. వారికి మేం సినిమాలు చేయడం ఇష్టంలేదేమో అంటున్న Vijay Deverakonda

ABN , First Publish Date - 2022-08-22T15:14:28+05:30 IST

ఎటువంటి సపోర్టు లేకుండా టాలీవుడ్‌లో స్టార్‌డమ్ సాధించిన నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. శేఖర్ కమ్ముల సినిమాలో చిన్న రోల్‌ చేసిన విజయ్..

Boycott Liger: అది మా మూడేళ్ల కష్టం.. వారికి మేం సినిమాలు చేయడం ఇష్టంలేదేమో అంటున్న Vijay Deverakonda

ఎటువంటి సపోర్టు లేకుండా టాలీవుడ్‌లో స్టార్‌డమ్ సాధించిన నటుల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. శేఖర్ కమ్ముల సినిమాలో చిన్న రోల్‌ చేసిన విజయ్.. తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’తో సోలో హీరోగా మారి హిట్ కొట్టాడు. అనంతరం చేసిన ‘అర్జున్ రెడ్డి’తో క్రేజీ నటుడిగా మారిపోయాడు. అందులో ఆయన యాటిట్యూడ్‌కి దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ని సాధించుకున్నారు. విజయ్ తాజాగా నటించిన చిత్రం ‘లైగర్(Liger)’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya pandey) హీరోయిన్‌గా నటిస్తోంది.


కరణ్ జోహార్, ఛార్మీ, పూరీ నిర్మాతలుగా వ్యవహారిస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ తరుణంలో మూవీ ప్రమోషన్స్‌ని చిత్రబృందం జోరుగా సాగిస్తోంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇటీవలే విడుదలై అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిన ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’పై విజయ్ స్పందించాడు. బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా ట్రెండింగ్ విమర్శిస్తూ కామెంట్స్ చేశాడు. దీంతో లైగర్‌ని కూడా బాయ్‌కాట్ చేయాలంటూ ‘Boycott Liger’ని నెటిజన్ ట్రెండ్ చేశారు. దీనిపై ఇంతకుముందే విజయ్ స్పందిస్తూ.. ‘మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు, మన ధర్మం మనం చేసినప్పుడు, ఎవడిమాటా వినేదే లేదు.. కొట్లాడదాం..’ అంటూ ఫైర్ ఎమోజీని, అలాగే లైగర్ ట్యాగ్‌ని పోస్ట్ చేశాడు.


ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ‘మేం సినిమా ప్రారంభించినప్పుడు బాయ్‌కాట్ బాలీవుడ్ అనేది లేదు. ఆ సమయంలో మా సినిమాని పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లడానికి కరణ్ జోహార్ సర్ కనిపించారు. బాహుబలిలాగే మా మూవీ ఉపయోగపడతారని అనుకున్నాం. ఆయన మాతో కలవడం వల్లే నార్త్ మన సినిమాకు ఇంత రీచ్ వచ్చింది. అయితే.. ఆన్‌లైన్ ట్రోలర్స్ సమస్య ఏమిటో.. వాళ్లకు ఏం కావాలో నాకు ఖచ్చితంగా తెలియట్లేదు. వారికి మేం సినిమాలు చేయడం ఇష్టం లేదేమో. మేము మాత్రం కరెక్ట్‌గా ఉన్నాం. నేను హైదరాబాద్‌లో పుట్టాను. చార్మీ పంజాబ్‌లో పుట్టింది. పూరీ సార్ నర్సీపట్నంలో పుట్టారు. మేం మూవీస్ చేయకూడదా? మూడేళ్లు కష్టపడి ఈ సినిమా చేశాం. మా సినిమాలను మేం విడుదల చేయకోకుడదా? మేం ఇంట్లోనే కూర్చోవాలా?. ప్రేక్షకులు మాపై చూపిస్తున్న ప్రేమను మీరందరూ చూస్తున్నారు. అలాంటి ప్రేక్షకుల కోసమే సినిమాలు చేస్తున్నాను. ఆ ప్రేక్షకులు నాకు కావాలి. మా కోసం ఇంతమంది ఉండగా మాకు ఏ భయం లేదు’ అంటూ కొంచెం ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-08-22T15:14:28+05:30 IST