Liger Twitter Review: విజయ్, పూరీ కాంబో మూవీ ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2022-08-25T14:33:16+05:30 IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌తో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’.

Liger Twitter Review: విజయ్, పూరీ కాంబో మూవీ ఎలా ఉందంటే..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌తో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన.. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇంతకుముందే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ని అందుకుని.. ఆ హైప్‌ని భారీగా పెంచేసింది.


దానికితోడు మొదటి సినిమా కూడా విడుదల అవ్వకముందే నార్త్‌లోని వివిధ నగరాల్లో విజయ్‌కి దక్కిన ఆదరణ.. అదే స్థాయిలో ప్రమోషన్స్‌కు కూడా చేయడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అన్ని అంచనాల నడుమ ఆ సినిమా ఈరోజు (ఆగస్టు 25) విడుదలైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైన ఈ మూవీ ప్రిమీయర్ షోస్ ఇప్పటికే పడిపోయాయి. ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు ఈ సినిమా గురించి విశేషాలు పంచుకుంటున్నారు. అందులో కొందరూ సూపర్ అంటుండగా.. కొందరూ మాత్రం బాలేదని పెదవి విరుస్తున్నారు. కాగా.. ట్విట్టర్‌లో నెటిజన్లు సినిమా గురించి ఏమంటున్నారో చూద్దాం..





















Updated Date - 2022-08-25T14:33:16+05:30 IST