Liger: ప్రమోషన్‌ని మధ్యలోనే ఆపేసిన విజయ్, అనన్య.. వారు అలా చేయడమే కారణం..

ABN , First Publish Date - 2022-08-01T18:29:42+05:30 IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబో వస్తున్న క్రేజీ మూవీ ‘లైగర్(Liger)’..

Liger: ప్రమోషన్‌ని మధ్యలోనే ఆపేసిన విజయ్, అనన్య.. వారు అలా చేయడమే కారణం..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబో వస్తున్న క్రేజీ మూవీ ‘లైగర్(Liger)’. కరణ్ జోహార్ (Karan Johar), పూరీ, ఛార్మీ నిర్మిస్తున్న ఈ మూవీలో అనన్య పాండే (Ananya Pandey) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్, ట్రైలర్‌ మంచి రెస్పాన్స్‌ అందుకొని అంచనాలను భారీగా పెంచాయి. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఆగస్టు 25న విడుదలకానుంది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌ చేయడంలో మూవీ టీం బిజీగా ఉంది. ఈ తరుణంలో ముంబైలోని ఓ మాల్‌లో ప్రచారం చేసేందుకు విజయ్, అనన్య ఓ ఈవెంట్‌కి వెళ్లారు.


అక్కడ విజయ్‌ని చూసిన ఫ్యాన్స్ క్రేజీగా మారిపోయి రచ్చరచ్చ చేశారు. ‘మాకు నువ్వంటే చాలా ఇష్టం విజయ్’ అంటూ అరవడం ప్రారంభించారు. కొందరు లేడి ఫ్యాన్స్ అయితే స్పృహ తప్పి పడిపోయారు. మరికొందరు ఏడవడం ప్రారంభించారు. ఈ తరుణంలో కొందరు అభిమానులు దగ్గర నుంచి విజయ్‌ని చూడాలనే ఉద్దేశంతో నటులు ఉన్న వేదిక దగ్గరకి దూసుకెళ్లారు. అది తొక్కిసలాటకి దారి తీసింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో విజయ్, అనన్య ఈవెంట్ నుంచి మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది.


ఈ ఈవెంట్ గురించి ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘విజయ్ వేదికపైకి వెళ్లిన మరుక్షణం చుట్టూ అరుపులు, కేకలు. కొంతమంది మహిళా అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. మరికొందరు అమ్మాయిలు ఏడ్వడం చూసి నిర్వాహకులు, వాలంటీర్లు షాక్ అయ్యారు. చాలామంది అభిమానులు విజయ్ పోస్టర్లు, స్కెచ్‌లను చేతుల్లో పట్టుకున్నారు. అంతేకాకుండా ‘విజయ్ వి లవ్ యూ’ అంటూ అరవడం ప్రారంభించారు’ అని చెప్పుకొచ్చాడు. ఆ సందర్భంలో విజయ్ మరాఠీలో ముంబై అభిమానులను పలకరించే వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాగా.. ఈ పాన్ ఇండియా మూవీలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు.



Updated Date - 2022-08-01T18:29:42+05:30 IST