నార్త్, సౌత్ డిబేట్‌పై Ranveer Singh ముందే Vijay Devarakonda కీలక వ్యాఖ్యలు.. శ్రీదేవి సౌత్ నుంచేనంటూ..

ABN , First Publish Date - 2022-07-22T18:36:57+05:30 IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబినేషన్‌లో..

నార్త్, సౌత్ డిబేట్‌పై Ranveer Singh ముందే Vijay Devarakonda కీలక వ్యాఖ్యలు.. శ్రీదేవి సౌత్ నుంచేనంటూ..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. అనన్య పాండే (Ananya Panday) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలు పొషిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో మూవీ టీం ఈ చిత్ర టైలర్‌ని తాజాగా విడుదల చేసింది. భారీ స్థాయిలో జరిగిన ఈ ఈవెంట్‌కి ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ తరుణంలో ఎప్పటి నుంచి నడుస్తున్న బాలీవుడ్ వర్సెస్ సౌత్ టాపిక్‌ ఇక్కడ కూడా చర్చకు వచ్చింది. 


దీనిపై విజయ్ స్పందిస్తూ మొదట.. ‘మాకు మద్దతు తెలిపినందుకు ఎనర్జీకి మారుపేరైనా రణ్‌వీర్ సింగ్‌కి ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం విజయ్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఉత్తరాది  పరిశ్రమలో ఎంతోమంది సౌత్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారు. అలాగే.. ఉత్తరాది నుంచి ఎంతోమంది నటీమణులు దక్షిణాదిలో హీరోయిన్లుగా స్థిరపడ్డారు. తెలుగు, తమిళ దర్శకులు ఉత్తరాదిలో సినిమాలు తీస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. బాలీవుడ్‌లో స్టార్‌గా ఉన్న అనిల్ కపూర్ సౌత్‌ సినిమాతోనే అరంగేట్రం చేశారు. బాలీవుడ్‌ని ఎలిన అందాల తార శ్రీదేవి దక్షిణాది నుంచే వచ్చారు. సినీ పరిశ్రమ అంటేనే వివిధ భాషల ఇండస్ట్రీలు కలిసి పని చేయాల్సి వస్తుంది.


దక్షిణాది చిత్రాలకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ వల్ల పోలికలు, పాన్ ఇండియా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది దేశం మొత్తం చూసే విధంగా సినిమా తీస్తున్నారు. ఇకపై నార్త్, సౌత్ అని పిలవకుండా కేవలం ఇండియన్ సినిమా, ఇండియన్ యాక్టర్ అని పిలిచే రోజు కోసం ఎదురు చూస్తున్నాను’ అని తెలిపాడు.

Updated Date - 2022-07-22T18:36:57+05:30 IST