Devarakonda Brothers : అన్న థియేటర్స్‌లో.. తమ్ముడు ఓటీటీలో

ABN , First Publish Date - 2022-08-08T14:11:33+05:30 IST

ప్రస్తుతం సినిమా టాక్ బాగుంటేనే తప్ప.. జనం థియేటర్స్‌కు రావడం లేదు. కంటెంట్లో దమ్ముంటే పబ్లిసిటీతో పనిలేకుండానే జనం తండోపతండాలుగా క్యూలు కడతారు. అయితే ఎంత కంటెంట్‌ను నమ్ముకున్నప్పటికీ.. కొన్ని సినిమాలు ఇప్పుడు థియేటర్స్‌లో విడుదల కాని పరిస్థితుల్లో ఉన్నాయి.

Devarakonda Brothers : అన్న థియేటర్స్‌లో.. తమ్ముడు ఓటీటీలో

ప్రస్తుతం సినిమా టాక్ బాగుంటేనే తప్ప.. జనం థియేటర్స్‌కు రావడం లేదు. కంటెంట్లో దమ్ముంటే పబ్లిసిటీతో పనిలేకుండానే జనం తండోపతండాలుగా క్యూలు కడతారు. అయితే ఎంత కంటెంట్‌ను నమ్ముకున్నప్పటికీ.. కొన్ని సినిమాలు ఇప్పుడు థియేటర్స్‌లో విడుదల కాని పరిస్థితుల్లో ఉన్నాయి. అలాంటి సినిమాలకు ఓటీటీనే దిక్కు. తాజాగా అలాంటి ఓ వర్త్ వాచింగ్ మూవీ ఆహా ఓటీటీలో విడుదలకు రెడీగా ఉంది. సినిమా పేరు ‘హైవే’ (Highway). విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరో. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ (KV Guhan) దర్శకుడు. మానసా రాధాకృష్ణన్ (Manasa Radhakrishna) కథానాయికగా నటిస్తోంది. శ్రీ ఐశ్వర్యా లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి (Venkat Thalari) ఈ సినిమాను నిర్మించారు. సైమన్ కింగ్ (Simon King) సంగీతం అందిస్తున్నారు. 


‘దొరసాని’ (Dorasani) చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. తొలి ప్రయత్నం ఫెయిల్ అయినప్పటికీ.. తదుపరి చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ (Middleclass Melodies) మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత చిత్రం ‘పుష్పక విమానం’ (Pushpaka Vimanam) పర్వా లేదనిపించుకుంది. ఇప్పుడు నాలుగో చిత్రం ‘హైవే’ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 19న ఆహా‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. సరికొత్త కథాంశంతో రాబోతున్న ఈ సినిమాపై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు ఆనంద్. 


‘హైవే’ చిత్రం విడుదలైన ఆరురోజులకు... ఆనంద్ అన్న విజయ్ దేవరకొండ ‘లైగర్’ (Liger) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. తమ్ముడి సినిమా ఓటీటీ బాట పడితే.. అన్న తన సినిమాతో అభిమానుల్ని థియేటర్స్ కే రప్పించుకోబోతున్నాడు. ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలున్నాయి. విజయ్ బాక్సర్‌గా చెలరేగే యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రానికి హైలైట్స్ అంటున్నారు. మరి దేవరకొండ బ్రదర్స్ (Devarakonda Brothers) తమ చిత్రాలతో ఎలాంటి రిజల్ట్ రాబడతారో చూడాలి.      

Updated Date - 2022-08-08T14:11:33+05:30 IST