Chiranjeevi-Salman khan: ‘గాడ్‌ఫాదర్‌’తో లైగర్‌

ABN , First Publish Date - 2022-08-02T02:45:17+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి సందడి చేశారు విజయ్‌ దేవరకొండ. ఆ ఫొటోను విజయ్‌ నెట్టింట షేర్‌ చేయగా, వైరల్‌గా మారింది. ప్రస్తుతం అందరి దృష్టి ఈ ఫొటోపైనే ఉంది. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ సెట్‌లో వీరంతా కలిశారు.

Chiranjeevi-Salman khan: ‘గాడ్‌ఫాదర్‌’తో లైగర్‌

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌(Salman khan)తో కలిసి సందడి చేశారు విజయ్‌ దేవరకొండ. ఆ ఫొటోను విజయ్‌ నెట్టింట షేర్‌ చేయగా, వైరల్‌గా మారింది. ప్రస్తుతం అందరి దృష్టి ఈ ఫొటోపైనే ఉంది. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’(God father) సెట్‌లో వీరంతా కలిశారు. ఇటీవల ప్రభుదేవా కొరియోగ్రఫీలో ముంబైలో చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌పై హుషారైన పాటను తెరకెక్కించారు. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో విజయ్‌, పూరి జగన్నాథ్‌, ఛార్మి ‘గాడ్‌ ఫాదర్‌’ సెట్‌లో కలిశారు. చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లతో కాేసపు ముచ్చటించి, ఫొటో క్లిక్‌మనిపించారు. ఈ ఫొటను విజయ్‌ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘‘లైగర్‌’ సినిమాకు మీరు ఇచ్చిన బ్లెసింగ్స్‌తోపాటు ప్రపంచమంత ప్రేమను పంచారు. మీపై గౌరవం, ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటాయి’’ అని రాసుకొచ్చారు విజయ్‌. (Liger)

మలయాళంలో హిట్టైన ‘లూసిఫర్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Updated Date - 2022-08-02T02:45:17+05:30 IST