Vijay Devarakonda: ప్రతి సినిమాని తమిళంలో రిలీజ్‌ చేస్తా..

Twitter IconWatsapp IconFacebook Icon
Vijay Devarakonda: ప్రతి సినిమాని తమిళంలో రిలీజ్‌ చేస్తా..

ఇకపై ప్రతి ఒక్క చిత్రాన్ని తమిళంలోకి అనువదించి విడుదల చేస్తానని టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) తెలిపారు. సరైన దర్శకుడు ముందుకు వస్తే తమిళంలో స్ట్రైట్ మూవీ చేస్తానని ఆయన వెల్లడించారు. పూరీ జగన్నాథ్‌ (Puri Jagannath) దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే (Ananya Pandey) జంటగా నటించిన ‘లైగర్‌’ (Liger) చిత్రం ఈ నెల 25న తమిళ, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ చిత్ర ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా శనివారం నగరంలో జరిగిన మీడియా సమావేశంలో విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే, తమిళ హీరో, స్టూడియో 9 అధినేత ఆర్‌కె.సురేష్‌ పాల్గొన్నారు. 

ఇందులో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘లైగర్‌’ ఒక పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో నా పాత్ర ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ‘నోటా’తో తొలిసారి తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యాను. ఇపుడు ‘లైగర్‌’ ద్వారా వస్తున్నాను. ఇకపై నేను తెలుగులో నటించే ప్రతి చిత్రాన్ని తమిళంలోకి డబ్‌ చేసి విడుదల చేస్తాను. మంచి దర్శకుడు ముందుకొస్తే డైరెక్ట్‌గా తమిళ చిత్రంలో నటిస్తాను. 

నాకు వ్యక్తిగతంగా హీరో అజిత్‌, విజయ్‌ అంటే ఇష్టం. ప్రపంచ మాజీ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌తో కలిసి నటించడం కొత్త అనుభూతిని ఇచ్చింది. సీనియర్‌ నటి రమ్యకృష్ణ మాస్‌ మదర్‌ క్యారెక్టర్‌లో నటించారు. ఆమె నుంచి ఎన్నో విషయాలు, మెళకులు నేర్చుకున్నాను’ అని వివరించారు.  ‘లైగర్‌’ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్‌ చేస్తున్నాం’ అని  స్టూడియో 9 అధినేత ఆర్‌.కె.సురేష్‌ తెలిపారు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.