Vijay Devarakonda: శివ నిర్వాణకు కండీషన్స్?

ABN , First Publish Date - 2022-04-24T15:03:49+05:30 IST

నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను ప్రారంభించారు. ఇది విజయ్ కెరీర్‌లో 11వ సినిమా.

Vijay Devarakonda: శివ నిర్వాణకు కండీషన్స్?

నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను ప్రారంభించారు. ఇది విజయ్ కెరీర్‌లో 11వ సినిమా. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా సమంత నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ కశ్మీర్‌లో ల్యాండ్ అయ్యాడు. 


కశ్మీర్‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసి చిత్ర బృందం తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. మే చివరి వరకు అక్కడే టీమ్ ఈ షెడ్యూల్ జరిపి, ఆ తరువాత వైజాగ్, అలెప్పీలలో జరిపే షెడ్యూల్స్‌తో మొత్తం షూటింగ్ పూర్తి చేయనున్నారట. అయితే, ఈ విషయంలో విజయ్ దేవరకొండ డైరెక్టర్ శివ నిర్వాణకు కండీషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. వీలైంత త్వరగా ఈ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేస్తే..ఆ తర్వాత పూరి దర్శకత్వంలో కమిటైన జనగణమన షూటింగ్‌లో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. అందుకే, శివ నిర్వాణకు త్వరగా టాకీపార్ట్ కంప్లీట్ చేసేలా కండీషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక 'లైగర్' సినిమా, శివ నిర్వాణతో చేస్తున్న సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేసేలా కూడా వీడీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-04-24T15:03:49+05:30 IST