Vijay Devarakonda: ‘లైగర్‌’ కుమ్మేస్తది

ABN , First Publish Date - 2022-08-21T17:24:57+05:30 IST

‘లైగర్‌’ (Liger) కుమ్మేస్తది అన్నారు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఆయన హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

Vijay Devarakonda: ‘లైగర్‌’ కుమ్మేస్తది

‘లైగర్‌’ (Liger) కుమ్మేస్తది అన్నారు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఆయన హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నాన్ స్టాప్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా గుంటూలో ఘనంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.


ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ..‘లైగర్‌’.. ‘నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీ. నా సినిమా మీద నాకు నమ్మకం వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎంజాయ్‌ చేయాలనుకున్నాను. కరెక్ట్ టైంలో లైఫ్‌ డ్రామా మొదలయింది. వరుసగా షెడ్యూల్స్‌ ఉండటంతో ఆరోగ్యం సహకరించలేదు. ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీరు ఇచ్చిన ప్రేమే. ఇక్కడే కాదు, ఇండియాలో ఏ ఊరు వెళ్లినా విపరీతంగా ప్రేమించారు. యాక్టింగ్‌ ఆపేసి, 60ఏళ్లు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నా కూడా.. ఈ 20 రోజుల్లో జరిగిన ఈవెంట్స్‌, మీ ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేను. మీరంతా నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఇచ్చారు. ఇప్పుడు నేను తిరిగి మంచి జ్ఞాపకాన్ని ఇవ్వాలి. మీ అందరికీ గుర్తుండిపోయే సినిమాలు ఇవ్వాలనుకున్నా. 


వాటిలో ఒక అడుగు ‘లైగర్‌’ సినిమా అని నమ్ముతున్నా. ఈ కథ విన్నప్పుడు నేను ఏం చెప్తానా? అని పూరి జగన్నాథ్ (Puri Jagannath), ఛార్మి (Charmy) నావైపు చూశారు. నా నోటి నుంచి వచ్చిన ఒకే ఒక మాట ‘మెంటల్‌’. ఈ సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నా. కానీ, మూడేళ్లు పట్టింది. ప్రతి సీన్‌ చేస్తున్నప్పుడు వాటిని చూస్తే నా నోటి నుంచి వచ్చిన ఒకే మాట ‘మెంటల్’. నేను గ్యారెంటీగా చెప్తున్నా సినిమా కుమ్మేస్తది’.. అని అన్నారు. ఇక ఈ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలకు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మించాయి.  

Updated Date - 2022-08-21T17:24:57+05:30 IST