Vijay devarakonda: లైగర్‌ మీట్‌.. విజయ్‌ కామెంట్స్‌!

ABN , First Publish Date - 2022-08-15T22:14:14+05:30 IST

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘లైగర్‌’ విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రచారాలను ముమ్మరం చేసింది. దేశం మొత్తం తిరిగొచ్చిన ఈ టీమ్‌ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులతో ఇంటరాక్ట్‌ అవుతున్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడింది ‘లైగర్‌’ బృందం.

Vijay devarakonda: లైగర్‌ మీట్‌.. విజయ్‌ కామెంట్స్‌!

విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda)హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri jaganadh)దర్శకత్వం వహించిన ‘లైగర్‌’ (Liger)విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రచారాలను ముమ్మరం చేసింది. దేశం మొత్తం తిరిగొచ్చిన ఈ టీమ్‌ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులతో ఇంటరాక్ట్‌ అవుతున్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడింది ‘లైగర్‌’ బృందం. ఈ వేదికపై హీరో విజయ్‌ దేవరకొండ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘లైగర్‌ పక్కా తెలుగు సినిమా అని, హిందీ ఆడియన్స్‌కి కావలసిన కంటెంట్‌ కూడా ఇందులో ఉందని చెప్పారు. 


కెరీర్‌ బిగినింగ్‌లో పూరిగారి  దగ్గర  సహాయ దర్శకుడిగా పనిచేద్దాం అనుకున్నా. కానీ  కుదరలేదు. ఆయన దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం దక్కింది. ఈ సినిమా ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’ కాదు. అలాగని బాక్సింగ్‌ సినిమా కూడా కాదు. తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించాం. తప్పకుండా ఇండియాని షేక్‌ చేస్తాం. 


నా కెరియర్‌లో చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. వంద శాతం ఎఫర్ట్‌ ఈ సినిమాకి ఇచ్చేసా. నన్ను నేను డాన్సర్‌గా చూసుకోను. డాన్స్‌ అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. మైక్‌ టైసన్‌తో  పని  చెయ్యడంతో మజా  వచ్చింది. ఆయన చాలా  మంచి  మనిషి. కానీ టైసన్‌తో ఫైట్‌ అనగానే ఇంట్లో భయపడ్డారు. ఆయనతో ఒక పెద్ద ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంది. అందరినీ అలరిస్తుంది. 



Updated Date - 2022-08-15T22:14:14+05:30 IST