వైరల్ అవుతోన్న ‘బీస్ట్‌’ న్యూ పిక్

ABN , First Publish Date - 2022-03-29T03:02:38+05:30 IST

నెల్సన్‌ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘బీస్ట్‌’. ఏప్రిల్‌ 13న ఐదు భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా విడుదలకానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌. ఇందులో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్‌ ప్రధాన

వైరల్ అవుతోన్న ‘బీస్ట్‌’ న్యూ పిక్

నెల్సన్‌ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘బీస్ట్‌’. ఏప్రిల్‌ 13న ఐదు భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా విడుదలకానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌. ఇందులో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు మూడు స్టిల్స్‌ రిలీజ్‌ చేయగా వాటికి మంచి స్పందన వచ్చింది. అలాగే, రెండు లిరికల్‌ పాటలను విడుదల చేయగా.. అవి కూడా అనూహ్య స్పందనను అందుకున్నాయి. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు.


ఇది గమనించిన మేకర్స్.. తాజాగా విజయ్‌ సరికొత్త లుక్‌‌తో ఉన్న పిక్‌ని రిలీజ్‌ చేశారు. ఈ పిక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, వెండితెరపై ‘బీస్ట్‌’, ‘కెజిఎఫ్ 2’ చిత్రాల మధ్య ఆసక్తికర పోటీ జరగబోతోంది. ఈ రెండు చిత్రాలు ఒక రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.



Updated Date - 2022-03-29T03:02:38+05:30 IST