జనవరి 26న.. విజయ్ ఆంటోనీ వర్సెస్ సోనూసూద్

ABN , First Publish Date - 2022-01-03T01:44:38+05:30 IST

విజయ్‌ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘తమిళరసన్‌’ చిత్రం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న థియేటర్లలో విడుదలకానుంది. ఈ మేరకు చిత్ర బృందం..

జనవరి 26న.. విజయ్ ఆంటోనీ వర్సెస్ సోనూసూద్

విజయ్‌ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘తమిళరసన్‌’ చిత్రం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న థియేటర్లలో విడుదలకానుంది. ఈ మేరకు చిత్ర బృందం కొత్త సంవత్సరం సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రమ్యా నంబీశన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నిజానికి గత యేడాది డిసెంబరులోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా రిలీజ్‌ను వాయిదా వేశారు. 


ఈ చిత్రంలో విజయ్‌ ఆంటోనీ, సోనూసూద్‌ పోటాపోటీగా తలపడినట్టు సమాచారం. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని చిత్రయూనిట్ ప్రకటించడమే కాకుండా.. ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా అదే తెలియజేసింది. వీరితోపాటు సురేష్ గోపీ‌, చాయా సింగ్‌, సంగీత క్రిష్‌, యోగిబాబు, పాండిరాజన్‌, కస్తూరి వంటి వారి పాత్రలు కూడా ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలుపుతున్నారు. కాగా, ఎస్‌ఎన్‌ఎస్‌ ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానరుపై ఎస్‌.కౌసల్య రాణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంగీత మేధావి’ ఇళయరాజా సంగీతం సమకూర్చారు. 

Updated Date - 2022-01-03T01:44:38+05:30 IST