విజయ్‌ ఆంటోనీ హీరోగా పాన్ ఇండియా చిత్రం

ABN , First Publish Date - 2022-05-09T16:16:38+05:30 IST

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) చిత్రాలకు టాలీవుడ్‌లో సైతం మంచి డిమాండ్ ఉంది. ఆయన సినిమాలు తమిళ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా ఒకేసారి విడుదలవుతుంది. ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘వళ్ళి మయిల్’.

విజయ్‌ ఆంటోనీ హీరోగా   పాన్ ఇండియా చిత్రం

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) చిత్రాలకు టాలీవుడ్‌లో సైతం మంచి డిమాండ్ ఉంది. ఆయన సినిమాలు తమిళ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా ఒకేసారి విడుదలవుతుంది. ప్రస్తుతం ఆయన  వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘వళ్ళి మయిల్’ (Valli mayil). సుశీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఇందులో దర్శక దిగ్గజం భారతీరాజా, సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ కీలక పాత్రలు పోషించనున్నారు.  విజయ్‌ ఆంటోనీ సరసన తెలుగు సూపర్‌హిట్‌ చిత్రం ‘జాతిరత్నాలు’ ఫేం ఫరీదా అబ్దుల్లా (Faria abdulla) హీరోయిన్‌గా ఎంపికచేయగా, టాలీవుడ్‌ నటుడు సునీల్‌, తంబి రామయ్య, సింగం పులి, రెడిన్‌ కింగ్‌స్లీ, మనీషా యాదవ్‌, అరంతాంగి నిషా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 


1980 బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ ఈ నెల 16 నుంచి దిండిగల్‌లో ప్రారంభించి, తేని, కారైక్కుడి, గోబిశెట్టిపాళెయం, పళని తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ చేయనున్నారు. నల్లుస్వామి పిక్చర్స్‌ తాయ్‌ శరవణన్‌ నిర్మించే ఈ చిత్రానికి కెమెరా విజయ్‌ కె.చక్రవర్తి, ఎడిటర్‌ ఆంటోనీ, సంగీతం డి.ఇమ్మాన్‌, సహ నిర్మాత కార్తీక్‌. మరి ఈ సినిమా విజయ్ ఆంటోనీ (Vijay Antony) కి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 

Updated Date - 2022-05-09T16:16:38+05:30 IST