Vijay Antony: కొత్త చిత్రం ప్రారంభం..

Twitter IconWatsapp IconFacebook Icon

హీరో విజయ్‌ ఆంటోనీ (Vijay Antony), దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathi Raja), సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ (Sathya Raj) కలిసి ఓ మూవీలో నటిస్తున్నారు. సుశీంద్రన్‌ ( Suseendran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కొత్త చిత్రం ‘వల్లిమయిల్‌’ (Vallimayil) పేరుతో రూపొందుతోంది. నల్లుస్వామి పిక్చర్స్‌ పతాకంపై తాయ్‌ శరణన్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ సోమవారం పూజా కార్యక్రమంతో ప్రారంభంకాగా, రాష్ట్ర ఆహార శాఖామంత్రి చక్రపాణి తొలిక్లాప్‌ కొట్టారు. దిండిగల్‌ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూత్తపూండి అనే గ్రామంలోని శివాలయంలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభించారు.

ఈ గ్రామంతో పాటు దిండిగల్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 రోజులపాటు షూటింగ్‌ జరుపుకోనుంది. ఇక్కడ పూర్తి చేసిన తర్వాత కొడైక్కెనాల్‌, తేని, కారైక్కుడి, గోబిశెట్టిపాళెయం, పళని ప్రాంతాల్లో మొదటి రోజు షూటింగ్‌లో విజయ్‌ ఆంటోనీ, టాలీవుడ్‌ నటి ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఆ తర్వాత షూటింగ్‌లో సత్యరాజ్‌, భారతీరాజా, తెలుగు నటుడు సునీల్‌, తంబి రామయ్య, రెడిన్‌ కింగ్‌స్లీ, సింగం పులి తదితరులు పాల్గొననున్నారు. 

డి.ఇమ్మాన్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని 1980 సంవత్సరంలో జరిగే స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియన్ రేంజ్‌లో రూపొందించనున్నారు. కాగా, విజయ్ ఆంటోని నటించిన తమిళ చిత్రాలు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో విడుదలై ఇక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా బిచ్చగాడు, ఇంద్రసేన, విజయ్ రాఘవన్, సలీమ్, సైతాన్, రోషగాడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.