TTD: నయనతార (Nayanatara)దంపతుల క్షమాపణ!

ABN , First Publish Date - 2022-06-11T19:10:38+05:30 IST

ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత వివాహబంధంతో ఒకటయ్యారు నయన్‌తార–విష్నేశ్‌ శివన్‌. మొదటి నుంచీ తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఈ జంట పలు కారణాల వల్ల మహాబలేశ్వరంలో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. తిరుమలలోనే పెళ్లి చేసుకున్నాం అనే భావన, ఆ జ్ఞాపకాల కోసం పసుపు బట్టలతోనే తిరుమల చేరుకుని స్వామి కల్యాణంలో భాగమయ్యారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు.

TTD: నయనతార (Nayanatara)దంపతుల క్షమాపణ!

ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత వివాహబంధంతో ఒకటయ్యారు నయన్‌తార–విష్నేశ్‌ శివన్‌(Nayanatara-Vegnesh shivan). మొదటి నుంచీ తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఈ జంట పలు కారణాల వల్ల మహాబలేశ్వరంలో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. తిరుమలలోనే పెళ్లి చేసుకున్నాం అనే భావన, ఆ జ్ఞాపకాల కోసం పసుపు బట్టలతోనే తిరుమల చేరుకుని స్వామి కల్యాణంలో భాగమయ్యారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే దర్శనానికి వచ్చిన ఈ జంట వివాదంలో చిక్కుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం, దేవాలయ ప్రాంగణంలో ఫొటోషూట్‌ చేయడంతో ఈ వివాదం తలెత్తింది. దీంతో తితిదే (TTD)అధికారులు నయన్‌–విఘ్నేశ్‌ జంటపై చర్చలు తీసుకునేందురు సిద్ధమయ్యారు.  దీనిపై వివరణ ఇస్తూ విఘ్నేశ్‌ ఓ లేఖ రాశారు. ‘‘భగవంతుడిపై మాకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. తిరుమలలో స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా అనుకుంటున్నాం. అదే పనిపై గడచిన నెల రోజుల్లో ఐదుసార్లు కొండకు వచ్చాం. కొన్ని కారణాల వల్ల మా పెళ్లి మహాబలేశ్వరంలో జరిగింది. పెళ్లి వేదిక నుంచి నేరుగా తిరుమల చేరుకున్నాం. స్వామి కల్యాణం వీక్షించి శుక్రవారం ఆశీస్సులు పొందాం. దర్శనం తర్వాత మా పెళ్లి ఇక్కడే జరిగిందన్న భావన కోసం, లైఫ్‌టైమ్‌ మాకు గుర్తుండేలా స్వామి ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్‌ చేసుకోవాలనుకున్నాం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడి నుంచి వెళ్లి పోయి మళ్లీ తిరిగి వచ్చాం. త్వరగా ఫొటోషూట్‌ పూర్తి చేయాలనే కంగారులో కాళ్లకు చెప్పులు ఉన్నాయనే సంగతి మరచిపోయాం. మేము భక్తితో కొలిచే ఆ స్వామి అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయనను అవమానించడానికి ఇలా చేయలేదు. దయచేసి మా వల్ల జరిగిన పొరపాటుకు క్షమించమని కోరుతున్నాం’’ అని విఘ్నేశ్‌ శివన్‌ రాసుకొచ్చారు. (Vignesh shivan - Nayanatara marriage)



అయితే ఈ విషయంపై నెటిజన్లు నయన్‌ దంపతులకు అండగా నిలిచారు. ‘‘పెళ్లి చేసుకున్న తర్వాత మొదట స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చిన నూతన దంపతుల పట్ల టీటీడీ అధికారులు ధోరణి కరెక్ట్‌ కాదు. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు, వారి సిబ్బంది తిరుమల మాఢ వీధుల్లో చెప్పులతో తిరిగిన సందర్భాలున్నాయి. వారిని నిలదీయలేని అధికారులు బలహీనులపై ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు’’ అని సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2022-06-11T19:10:38+05:30 IST