Baby bumps కి టైమ్ లేదంటోన్న busy భాభీస్!

ABN , First Publish Date - 2022-04-11T20:58:48+05:30 IST

2020లో ఎవరూ ఊహించని విధంగా కరోనా వచ్చి పడటంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా కుదుపుకు గురైంది. 2021లోనూ తేరుకోలేకపోయింది. 2022లో మళ్లీ ఇప్పుడు కాస్త గాడిలో పడుతోంది. అయితే, ఇదంతా సినీ ఇండస్ట్రీలోని ప్రొఫెషనల్ యాంగిల్. మరి సినిమా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ సంగతేంటి? మరీ ముఖ్యంగా, పెళ్లిల్లు అయిన గ్లామరస్ హీరోయిన్స్ అప్‌డేట్స్ ఏంటి?

Baby bumps కి టైమ్ లేదంటోన్న busy భాభీస్!

2020లో ఎవరూ ఊహించని విధంగా కరోనా వచ్చి పడటంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా కుదుపుకు గురైంది. 2021లోనూ తేరుకోలేకపోయింది. 2022లో మళ్లీ ఇప్పుడు కాస్త గాడిలో పడుతోంది. అయితే, ఇదంతా సినీ ఇండస్ట్రీలోని ప్రొఫెషనల్ యాంగిల్. మరి సినిమా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ సంగతేంటి? మరీ ముఖ్యంగా, పెళ్లిల్లు అయిన గ్లామరస్ హీరోయిన్స్ అప్‌డేట్స్ ఏంటి? 


ఎప్పుడూ బిజీగా ఉండే టాప్ హీరోయిన్స్ కూడా లాక్‌డౌన్స్ కారణంగా ఖాళీగా ఇళ్లలో కూర్చోవాల్సి వచ్చింది. నెలల తరబడి ఒంటరిగా ఉండాల్సి రావటంతో చాలా మంది అందగత్తెలు పెళ్లిల్లు చేసేసుకుంటే బెటర్ అనుకున్నారు. దాని ఫలితంగానే గత రెండు, మూడేళ్లలో చాలా మంది మిస్‌లు మిసెస్‌లు అయిపోయారు. వాళ్లలో కొందరైతే ప్రస్తుతం మమ్మీలు అయ్యేందుకు కూడా రెడీ అవుతున్నారు. లాక్‌డౌన్ కాలంలో అనుష్కా శర్మ తన ప్రెగ్నెన్సీ న్యూస్ బ్రేక్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, తరువాత చాలా మంది హీరోయిన్స్, టెలివిజన్ యాక్ట్రెసెస్ పెళ్లి, ప్రెగ్నెన్సీ వార్తలతో అభిమానులకి స్వీట్ సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ప్రస్తుతం అందాల ‘చందమామ‘ కాజల్ గర్భవతిగా ఉంది. అలాగే, బాలీవుడ్ బ్యూటీ సొనమ్ కపూర్ కూడా తల్లి అయ్యేందుకు సంసిద్ధురాలు అవుతోంది. మరోవైపు, సౌత్‌లోనూ ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజన బేబీ బంప్‌తో నెటిజన్స్‌ ముందుకొచ్చేసింది. లెటెస్ట్‌గా యమ్మీ మమ్మీల జాబితాలో చేరింది ‘బాపుగారి బొమ్మ’ ప్రణీత సుభాష్!


సహజంగా గర్భం దాల్చి తల్లులవుతోన్న హీరోయిన్సే కాదు... అద్దె గర్భం ద్వారా మమ్మీలవుతోన్న వారు కూడా ఈ మధ్య ఎక్కువయ్యారు. ప్రియాంక చోప్రా మొదలు ప్రీతీ జింతా వరకూ పలువురు సీనియర్ హీరోయిన్స్ సరోగసీ ద్వారా మాతృత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కాకపోతే, అందరి దృష్టీ అప్‌కమింగ్ మమ్మీల మీదే ఉంటోంది కానీ... ఈపాటికే అమ్మలవ్వాల్సిన అందాల భామలు ఒకరిద్దరు మాత్రం... ఆ ఆలోచనే చేయటం లేదు! తమ కంటే పెళ్లి విషయంలో, వయస్సు విషయంలో జూనియర్స్ అయిన కథనాయికలు కూడా గ్లామరస్ మదర్స్ క్లబ్‌లో జాయినైపోతోంటే... దీపికా, విద్యా బాలన్ లాంటి వారు మాత్రం తమ హబ్బీస్‌తో బేబీస్ సంగతి మాట్లాడుతున్నట్టే అనిపించటం లేదు! 


43 ఏళ్ల విద్యా బాలన్ 2012లో సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని పెళ్లాడింది. అంటే, దాదాపుగా పదేళ్ల వైవాహిక జీవితం ముగిసింది. అయినా ఎక్స్‌ట్రీమ్లీ టాలెంటెడ్ విద్యా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏం చేస్తున్నట్టు సంకేతాలు లేవు. మరోవైపు 2018లో రణవీర్‌తో ఏడు అడుగులు వేసిన 36 ఏళ్ల దీపికా కూడా ఇప్పుడప్పుడే మమ్మీ స్టేటస్ కోసం తహతహలాడుతోన్నట్టు కనిపించటం లేదు. ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ కే’ సినిమా సహా పలు చిత్రాల్లో ఆమె నటించాల్సి ఉంది. ఇక 43 విద్యా, 36 ఏళ్ల దీపికానే కాదు 38 ఏళ్ల మిసెస్ కత్రీనా కౌశల్ కూడా అప్‌కమింగ్ అమ్మల లిస్టులో ఉంది. విక్కీతో తన పెళ్లై మరీ ఎక్కువ కాలం కాలేదు. పోయిన సంవత్సరమే వారిద్దరు సంసార బంధంలో చిక్కుకున్నారు. వారికి ఇంకా హనీమూన్ పీరియడ్ కొనసాగుతోందని అంగీకారించాల్సిందే. అయితే, వయస్సు దృష్ట్యా ‘మల్లీశ్వరి’ కూడా త్వరగా మదర్ అయితేనే మంచిదంటున్నారు సొషల్ మీడియా యూజర్స్! 


విద్యా, దీపికా, కత్రీనా లాంటి వారు ఎప్పుడు మాతృత్వాన్ని పొందాలనే విషయం ఇతరులు ఎంత మాత్రం చర్చించకూడదు. కానీ, సినీ గ్లామర్‌ మొట్ట మొదట దెబ్బతీసేది ప్రైవెసీనే కదా... కాబట్టి ఈ సీనియర్ బ్యూటీస్‌కి పుట్టబోయే వారసులు గురించి బయట డిస్కషన్ కొనసాగుతూనే ఉంటుంది. లెట్స్ వెయిట్... మన ఏజ్డ్ ఏంజిల్స్ ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ అందిస్తారో మరి!   

Updated Date - 2022-04-11T20:58:48+05:30 IST