వైరల్ అవుతున్న విక్కీ కౌశల్, Katrina Kaif పెళ్లి జరిగిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ వీడియో

ABN , First Publish Date - 2021-12-13T02:17:15+05:30 IST

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరాలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి బీ టౌన్ నుంచి

వైరల్ అవుతున్న విక్కీ కౌశల్, Katrina Kaif పెళ్లి జరిగిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ వీడియో

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరాలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి బీ టౌన్ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. హాజరయిన అతిథులందరికి సిక్స్ సెన్సెస్‌లోనే బస ఏర్పాలు చేశారు.  విక్కీ కౌశల్ కజిన్ ఉపాసన వొహ్రా, ఆమె భర్త అరుణేంద్ర కుమార్ తమకు కేటాయించిన రూమ్‌లను వీడియో తీసి తాజాగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.


తమకు కేటాయించిన రూమ్‌ను అరుణేంద్ర వీడియో తీసి తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఉంచారు. ఆ రూమ్‌ను చూసిన అభిమానులు విలాసవంతంగా, రాజమహాల్‌ లాగా ఉందని కామెంట్ చేస్తున్నారు. మోషన్ సెన్సర్‌తో పనిచేసే టాయిలెట్‌లను కూడా చూపించారు. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఆ టాయిలెట్‌ల విలువ దాదాపుగా రూ.6లక్షలు ఉంటుందని బీ టౌన్ వర్గాలు తెలుపుతున్నాయి. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో ఉన్న ఇతర ప్రదేశాలను కూడా వారు చూపించారు. అన్ని కార్యక్రమాలు ఫర్‌ఫెక్ట్‌గా జరుగుతున్నాయని ఆ వీడియోలో వారు పేర్కొన్నారు. 


విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత మిత్రలు మాత్రమే హాజరయ్యారు. రెండు ఏళ్ల డేటింగ్ చేసిన అనంతరం వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి‌కి హాజరయిన అతిథులందరికి ఈ జంట స్పెషల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లను అందజేసింది. ఆ గిఫ్ట్‌లో ఒక మిఠాయి బాక్స్‌తో పాటు స్పెషల్ నోట్ ఉంది. ‘ మా పెళ్లి వేడుకలకి హాజరయినందుకు థ్యాంక్ యూ. మీ హాజరుతో మా వివాహాం ఘనంగా ముగిసింది. మా కలల జీవితాన్ని మేం ప్రారంభించబోతున్నాం. మాకు ఎంతో సరదాగా ఇక్కడ సమయం గడిచింది. మీకు కూడా అలాగే గడిచిందని ఆశిస్తున్నాం. ఈ పెళ్లి ప్రారంభం మాత్రమే. మరెన్నో సంబరాలకు మీరు తప్పక హాజరు కావాలి ’’ అని ఆ నోట్‌లో ఉంది.



Updated Date - 2021-12-13T02:17:15+05:30 IST