Katrina Kaifతో ఎంగేజ్‌మెంట్.. Vicky Kaushal ఫస్ట్ రియాక్షన్ ఏంటి?

ABN , First Publish Date - 2021-10-19T16:38:41+05:30 IST

ప్రస్తుతం బాలీవుడ్‌లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ప్రేమాయణం గురించి వార్తలు జోరుగా షికార్లు చేస్తున్నాయి.

Katrina Kaifతో ఎంగేజ్‌మెంట్.. Vicky Kaushal ఫస్ట్ రియాక్షన్ ఏంటి?

ప్రస్తుతం బాలీవుడ్‌లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ప్రేమాయణం గురించి వార్తలు జోరుగా షికార్లు చేస్తున్నాయి. వీరు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్‌‌కు బ్రేకప్ చెప్పేసిన కత్రిన.. విక్కీ కౌశల్‌కు దగ్గరైంది. కొద్ది రోజులుగా వీరిద్దరూ బహిరంగంగానే కలిసి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి నిశ్ఛితార్థం గురించిన వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని వార్తలు వచ్చాయి. 


తాజాగా తన సినిమా ప్రమోషన్ కోసం ఓ కార్యక్రమానికి వచ్చిన విక్కీ కౌశల్.. ఎంగేజ్‌మెంట్ వార్తల గురించి స్పందించాడు. `నేను షూటింగ్ స్పాట్‌లో ఉండగా ఈ ఎంగేజ్‌మెంట్ వార్తలు నా చెవిన పడ్డాయి. నిజం చెప్పాలంటే ఆ సమయంలో వాటి గురించి ఆలోచించడానికి నాకు సమయం దొరకలేదు. ఎందుకంటే అప్పటికి నేను షూటింగ్ మధ్యలో ఉన్నాను. ఫన్నీ విషయం ఏంటంటే.. నాకు, కత్రినకు ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని ఉదయం 9 గంటలకు వార్తలు మొదలయ్యాయి. సాయంత్రం 5 అయ్యే సరికి `అది నిజం కాదు` అని మళ్లీ మీడియానే రాసింది. కాబట్టి అందులో నేను చేయడానికి ఏం లేదు. వారు పుట్టించిన గాసిప్‌ను వారే ఖండించార`ని కౌశల్ చెప్పాడు.  


Updated Date - 2021-10-19T16:38:41+05:30 IST