నెల పూర్తి చేసుకున్న Mrs Katrina... సరికొత్త ఫోటోలో Vicky Kaushal ‘జోష్’!

ABN , First Publish Date - 2022-01-09T22:17:09+05:30 IST

విక్కీ కౌశల్, కత్రీనా వివాహం... నెల క్రితం దాకా ఎన్నో పుకార్లకి కారణంగా నిలిచింది. దాదాపుగా ఆ గాసిప్స్ అన్నీ నిజం చేసేస్తూ క్యాట్ అండ్ విక్కీ రాజస్థాన్‌లో ఏడు అడుగులు వేసేశారు! అయితే, డిసెంబర్ 9న మిష్టర్ అండ్ మిసెస్ అయిన బాలీవుడ్ స్టార్ కపుల్... అప్పుడే నెల రోజుల కాపురం పూర్తి చేసేశారు. అందుకే, ఫుల్ ‘జోష్‌’లో ఉన్నాడు ‘యురి’ హీరో విక్కీ!

నెల పూర్తి చేసుకున్న Mrs Katrina... సరికొత్త ఫోటోలో Vicky Kaushal ‘జోష్’!

విక్కీ కౌశల్, కత్రీనా వివాహం... నెల క్రితం దాకా ఎన్నో పుకార్లకి కారణంగా నిలిచింది. దాదాపుగా ఆ గాసిప్స్ అన్నీ నిజం చేసేస్తూ క్యాట్ అండ్ విక్కీ రాజస్థాన్‌లో ఏడు అడుగులు వేసేశారు! అయితే, డిసెంబర్ 9న మిష్టర్ అండ్ మిసెస్ అయిన బాలీవుడ్ స్టార్ కపుల్... అప్పుడే నెల రోజుల కాపురం పూర్తి చేసేశారు. అందుకే, ఫుల్ ‘జోష్‌’లో ఉన్నాడు ‘యురి’ హీరో విక్కీ! 


ఈ ఆదివారంతో, విక్యాట్ మ్యారీడ్ లైఫ్‌లో... ఫస్ట్ మంత్ కంప్లీట్ కావటంతో... ‘‘ఫర్‌ఎవర్ టూ గో’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్స్ ముందుకొచ్చాడు విక్కీ. కత్రీనాతో తన పెళ్లి తాలూకూ మథుర జ్ఞాపకాల్ని నెమరవేసుకుంటూ తమ సంగీత్ సంబరాల్లోని ఫోటో ఒకటి షేర్ చేశాడు. ఇప్పటికే వైరల్‌గా మారిన కలర్‌ఫుల్ పిక్‌లో... అతను బ్లూ కలర్ సవ్యసాచి కుర్తా ధరించాడు. ఇక ఆమె, డిజైర్ సవ్యసాచి రూపొందించిన పింక్ కలర్ లెహంగాలో మెరిసిపోయింది. కొత్త జంటని తమ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో జూమ్ చేసి మరీ చూసుకుంటోన్న ఫ్యాన్స్‌ కూడా తెగ మురిసిపోతున్నారు!


విక్కీ, కత్రీనా తమ పెళ్లి గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అలాగే, రాజస్థాన్‌లోని వెడ్డింగ్ వెన్యూ వద్దకి ఎలాంటి కెమెరాలు, మీడియాని కూడా అలౌ చేయలేదు. దాంతో విక్కీ వెడ్స్ క్యాట్ సంబరం... ఎలా జరిగిందో బయట ప్రపంచానికి ఇప్పటికే సస్పెన్సే! చూడాలి మరి, తమ పెళ్లి వేడుకల వీడియోని కత్రీనా, విక్కీ కౌశల్ ఇంకా ఎంత కాలానికి బయటపెడతారో...

Updated Date - 2022-01-09T22:17:09+05:30 IST