అభిమానిని హగ్ చేసుకున్న Vicky Kaushal... ఏడుస్తూ, వణికిపోయిన అమ్మాయి!

ABN , First Publish Date - 2022-05-07T04:06:45+05:30 IST

విక్కీ కౌశల్... ఈ నేమ్ ఇప్పుడు బాలీవుడ్ లో కేవలం ఓ నటుడి పేరు మాత్రమే కాదు. విక్కీ కౌశల్ ఓ బ్రాండ్ గా మారిపోయాడు. దమ్మున్న చిత్రాలు చేస్తూ... నటనకు మారు పేరుగా మారాడు. మరి అటువంటి టాలెంటెడ్, హ్యాండ్సమ్ యాక్టర్ కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండటంలో ఆశ్చర్యమేముంది? ఆశ్చర్యం లేకున్నా... తాజాగా ఓ నెటిజన్ షేర్ చేసిన ‘ఫ్యాన్ వీడియో’ చూస్తే మాత్రం... విక్కీ క్రేజ్ ఏంటో మనకు అర్థం అవుతుంది...

అభిమానిని హగ్ చేసుకున్న Vicky Kaushal... ఏడుస్తూ, వణికిపోయిన అమ్మాయి!

విక్కీ కౌశల్... ఈ నేమ్ ఇప్పుడు బాలీవుడ్ లో కేవలం ఓ నటుడి పేరు మాత్రమే కాదు. విక్కీ కౌశల్ ఓ బ్రాండ్ గా మారిపోయాడు. దమ్మున్న చిత్రాలు చేస్తూ... నటనకు మారు పేరుగా మారాడు. మరి అటువంటి టాలెంటెడ్, హ్యాండ్సమ్ యాక్టర్ కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండటంలో ఆశ్చర్యమేముంది? ఆశ్చర్యం లేకున్నా... తాజాగా ఓ నెటిజన్ షేర్ చేసిన ‘ఫ్యాన్ వీడియో’ చూస్తే మాత్రం... విక్కీ క్రేజ్ ఏంటో మనకు అర్థం అవుతుంది... 


విక్కీ కౌశల్ వీరాభిమాని అయిన ‘రిమ్ జిమ్’ అనే అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ లో తన అనుభవాన్ని వెల్లడించింది. విక్కీని తాను కలిసిన వీడియో షేర్ చేసిన ఆమె... ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరింత పెద్ద అభిమానినంటూ సగర్వంగా చెప్పుకొచ్చింది. ‘ఇంకా వణికిపోతున్నాను...’ అంటోంది విక్కీని కలుసుకున్న ఎగ్జైట్మెంట్ లో ఉన్న  రిమ్ జిమ్! ‘‘నాకు నీ చిత్రాలు, నటన అంటే ఇష్టం. నేను జీవితకాలం నీ అభిమానిగానే ఉంటానని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, నిన్ను కలిశాక నేను గతంలో కంటే మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయాను! నువ్వు నిజంగా అద్భుతమైన వ్యక్తివి!’’ అంటూ ఎమోషనల్ గా తన మనసులోని భావాలు వ్యక్తం చేసింది ఫ్యాన్ గాళ్ రిమ్ జిమ్... 


‘‘నువ్వొక రత్నం లాంటి వాడివని ప్రపంచానికి గొంతెత్తి చెప్పాలని ఉంది. ‘విక్కీ కౌశల్’కి ఎవ్వరూ సాటిరాలేరు. నీ 13 మిలియన్ల మంది అభిమానుల్లో నేనొక నిఖార్సైన అభిమానిని. మిష్టర్ కౌశల్, నువ్వు వెలిగిపోతూ ఉండాలి... నేను నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను...’’ అని కూడా విక్కీ కౌశల్ పై తన అభిమానాన్ని చాటుకుంది రిమ్ జిమ్...


అభిమానుల్ని రోజురోజుకూ పెంచుకుంటోన్న విక్కీ పర్సనల్ లైఫ్ లోనూ, ప్రొఫెషనల్ లైఫ్ లోనూ మంచి జోరు మీద ఉన్నాడు. కత్రీనా కైఫ్ లాంటి గార్జియస్ బ్యూటీని వైఫ్ గా పొందిన ఆయన నెక్ట్స్ ‘సామ్ బహదూర్’ బయోపిక్ లో నటిస్తున్నాడు. అలాగే, సారా అలీఖాన్ తో ఒక సినిమా, దర్శకుడు శశాంక్ ఖైతాన్ ‘గోవిందా నామ్ మేరా’ చిత్రాలు కూడా చేస్తున్నాడు. ధర్మా ప్రొడక్షన్స్ లాంటి భారీ బ్యానర్ లోనూ విక్కీ కౌశల్ ఓ సినిమాతో అలరించనున్నాడు... 



Updated Date - 2022-05-07T04:06:45+05:30 IST