Vikat Wedding : కలసి నటించలేదు... కలసి జీవితం పంచుకోబోతున్నారు! అదెలా?

ABN , First Publish Date - 2021-12-08T01:55:20+05:30 IST

విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్... ఇప్పుడు ఈ రెండు పేర్లూ... ఒకటి వినిపిస్తే మరొకటి తప్పక వినిపించే పరిస్థితి ఏర్పడిపోయింది. కానీ, సీన్ కట్ చేస్తే... 2019 కి ముందు ఎవ్వరూ ఈ జంటని ఊహించనైనా ఊహించలేదు! ఎందుకంటే, కత్రీనా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విక్కీతో కలసి చేయలేదు కాబట్టి...

Vikat Wedding : కలసి నటించలేదు... కలసి జీవితం పంచుకోబోతున్నారు! అదెలా?

విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్... ఇప్పుడు ఈ రెండు పేర్లూ... ఒకటి వినిపిస్తే మరొకటి తప్పక వినిపించే పరిస్థితి ఏర్పడిపోయింది. కానీ, సీన్ కట్ చేస్తే... 2019 కి ముందు ఎవ్వరూ ఈ జంటని ఊహించనైనా ఊహించలేదు! ఎందుకంటే, కత్రీనా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విక్కీతో కలసి చేయలేదు కాబట్టి...


సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ ప్రేమలో పడి, పెళ్లిల్లు చేసుకోవటాలు సర్వసాధారణం. అయితే, అందరిలోనూ దాదాపు ఎప్పుడూ ఉండే కామన్ పాయింట్... వారంతా కలసి పని చేయటమే! అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ మొదలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్ దాకా బోలెడన్ని లవ్ స్టోరీస్ ఆయా జంటలు సినిమా షూటింగ్స్‌లో ఉండగానే గుప్పుమన్నాయి. కానీ, కత్రీనా మాత్రం తాను ఒక్కసారి కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయని అందగాడితో రియల్ లైఫ్ రొమాన్స్‌కి లైఫ్‌లాంగ్ బేసిస్‌లో రెడీ అయిపోయింది! ఎలా? 


విక్కీ కౌశల్, కత్రీనా ఒక్క సినిమా కూడా కలసి చేయలేదు. నియర్ ఫ్యూచర్లో వాళ్లు తెర మీదకు వచ్చే చాన్సెస్ కూడా తక్కువే ఉన్నాయి. మిస్ కైఫ్ కాస్తా మిసెస్ కౌశల్ అయ్యాక ఎవరైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే చేయవచ్చు. అయితే, ఇంత వరకూ మాత్రం విక్కీ, కత్రీనా స్టారర్ ఒక్కటి కూడా లిస్టులో లేదు. అయినా వారిద్దరి మధ్యా సెగ ఎలా రాజుకుందంటే... కత్రీనా మొదటిసారి తనకు విక్కీతో నటించాలని ఉందంటూ ‘కాఫీ విత్ కరణ్’ షోలో చెప్పింది. 2019లో ఇది జరిగింది. అదే షో తాలూకూ మరో ఎపిసోడ్‌లో విక్కీ కౌశల్ ఉబ్బితబ్బిబయ్యాడు. కత్రీనా తనతో నటించాలని కోరుకుంటోందని తెలిసి మురిసిపోయాడు! 


2019లో విక్కీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ కత్రీనా చెప్పినప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు. కానీ, వెండితెరకి బదులు వందేళ్ల జీవితాన్నే పంచుకోబోతోంది క్యాట్. వారిద్దరూ పలు బాలీవుడ్ పార్టీలు, అవార్డ్ ఫంక్షన్స్‌లో కలుసుకోవటంతోనే ప్రేమ పుట్టిందని బీ-టౌన్‌లో చెబుతుంటారు...     

Updated Date - 2021-12-08T01:55:20+05:30 IST