Katrina Kaif, విక్కీ ఉండబోయే ఇల్లు ఎంత లగ్జరీగా ఉందో చూశారా..

ABN , First Publish Date - 2021-12-15T18:08:28+05:30 IST

బాలీవుడ్‌లో ఎంతో బజ్ క్రియేట్ చేసి ఎట్టకేలకు రహస్యంగా ఒకటైన జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్. పెళ్లికి ముందే వీరు ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ జంట తమ కూతురితో కలిసి ఉంటున్న ఇంటి పక్కనే..

Katrina Kaif, విక్కీ ఉండబోయే ఇల్లు ఎంత లగ్జరీగా ఉందో చూశారా..

బాలీవుడ్‌లో ఎంతో బజ్ క్రియేట్ చేసి ఎట్టకేలకు రహస్యంగా ఒకటైన జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్. పెళ్లికి ముందే వీరు ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ జంట తమ కూతురితో కలిసి ఉంటున్న ఇంటి పక్కనే.. ఈ నూతన దంపతులు ఓ ఇల్లు రెంటుకి తీసుకున్నారనే వార్తలు హల్‌చల్ చేశాయి. 


ఐదేళ్లు రెంటు ఉండేలా కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్న ఆ ఇంటికి 8 లక్షల రెంటు పే చేయనున్నట్లు సమాచారం. 7000 స్వ్కేర్ ఫీట్ ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌కి సీ ఫేసింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం 1.75 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించిందంటా ఈ జంట.


ఆషిష్ గ్రూప్ చెందిన ఈ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ముంబైలోని జుహులో ఉన్న ఈ ఇల్లు ఎంతో విలాసవంతంగా ఉంది. అందులో కిచెన్, పెద్ద హాలు, ఆరు వాష్‌రూమ్‌లు, ఓ పూజ గది, విశాలమైన బెడ్‌రూమ్‌లతోపాటు ఇద్దరు అసిస్టెంట్ల కోసం గదులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ భవనంలో స్విమ్మింగ్ పూల్‌తో కూడిన రూఫ్‌టాప్ డాబా, చక్కగా అమర్చబడిన వ్యాయామశాల, ప్రైవేట్ బీచ్ యాక్సెస్, విశాలమైన బేస్‌మెంట్ కార్ పార్కింగ్ ఉన్నాయి. బ్యూటీఫుల్ కపుల్ విక్యాట్ ఉండబోయే ఈ లగ్జరీయస్ అపార్ట్‌మెంట్‌పై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2021-12-15T18:08:28+05:30 IST