ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా యంగ్ హీరోయిన్‌కి సత్కారం

ABN , First Publish Date - 2022-04-02T21:43:18+05:30 IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారి ఆశీస్సులు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇది మరిచిపోలేని రోజు. దీనికి కారణమైన నా తల్లిదండ్రులకు, గురువులకు వినయపూర్వకంగా

ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా యంగ్ హీరోయిన్‌కి సత్కారం

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. వర్ధమాన నటి టీనా చౌదరిని సత్కరించారు. ఇనుప మేకులపై టీనా చౌదరి చేసిన కూచిపూడి నృత్యానికి వెంకయ్య నాయుడు ఎంతగానో ఆకర్షితులయ్యారు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారం అందుకున్న టీనా చౌదరి.. ఇది తనకు ఎంతో సంతోషకరమైన రోజుగా చెప్పుకొచ్చారు. విషయంలోకి వస్తే.. ఇటీవల హాస్య నటుడు అలీతో ‘పండుగాడి ఫొటో స్టూడియో’ చిత్రంలో నటించిన యంగ్ హీరోయిన్ టీనా చౌదరి కూచిపూడి నృత్యంలోనూ రాణిస్తుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ఇనుప మేకులపై కూచిపూడి నృత్యం చేసి.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుండి ప్రశంసలు, సత్కారాన్ని అందుకున్నారు.


ఈ సందర్భంగా టీనా చౌదరి మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారి ఆశీస్సులు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇది మరిచిపోలేని రోజు. దీనికి కారణమైన నా తల్లిదండ్రులకు, గురువులకు వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’’ అని తెలిపారు. కాగా, విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో టీనా చౌదరి ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆమె తండ్రి మన్నే సత్యనారాయణ, తల్లి శివకుమారి గుంటూరు జిల్లా తెనాలిలో లెక్చరర్లుగా పని చేస్తున్నారు.

Updated Date - 2022-04-02T21:43:18+05:30 IST