Ramarao On Duty: వేణు తొట్టెంపూడి లుక్ విడుదల

ABN , First Publish Date - 2022-07-06T23:17:22+05:30 IST

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty). శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై

Ramarao On Duty: వేణు తొట్టెంపూడి లుక్ విడుదల

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty). శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కొంత విరామం తర్వాత నటుడు వేణు తొట్టెంపూడి (Venu Thottempudi) ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించి ఉన్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ని బుధవారం.. అధికారికంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచరిస్తోంది. 


ఈ పోస్టర్‌లో సీఐ జమ్మి మురళి (CI Jammi Murali)గా వేణు కాస్త సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన పాత్ర ఈ చిత్రానికి ఎంతో కీలకమని, దాదాపు సినిమా మొత్తం రవితేజతో కలిసి ఈ పాత్ర ప్రయాణిస్తుందని మేకర్స్ తెలుపుతున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత మరోసారి వేణు బిజీ నటుడిగా మారతాడని చిత్రయూనిట్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా.. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు సంగీత ప్రియులను అలరించాయి. రీసెంట్‌గా విడుదల చేసిన థర్డ్ సింగిల్ ‘నా పేరు సీసా’ మాస్‌ని మెస్మరైజ్ చేస్తుండగా.. త్వరలోనే ఈ సినిమా టైటిల్ సాంగ్‌‌‌ని మేకర్స్ విడుదల చేయనున్నారు. 


యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం, సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జూలై 29న ఈ చిత్రాన్ని  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.



Updated Date - 2022-07-06T23:17:22+05:30 IST