Macharla Niyojakavargam : ‘గుంతలకిడి గురునాథం’ ఎవరంటే !

ABN , First Publish Date - 2022-07-20T22:25:38+05:30 IST

యంగ్ హీరో నితిన్ (Nithin), అందాల కృతి శెట్టి (Krithi Shetty) జోడీగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Rajasekhar Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'మాచర్ల నియోజకవర్గం' (Macharla Niyojakavargam).

Macharla Niyojakavargam : ‘గుంతలకిడి గురునాథం’ ఎవరంటే !

యంగ్ హీరో నితిన్ (Nithin), అందాల కృతి శెట్టి (Krithi Shetty) జోడీగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Rajasekhar Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'మాచర్ల నియోజకవర్గం' (Macharla Niyojakavargam). చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ పూర్తయింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో  మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల (Rajkumar Akella) సమర్పిస్తున్నారు. 


అత్యంత భారీ బడ్జెట్తో భారీ నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. కేథరిన్ ట్రెసా (Catherine Tressa) మరో కథానాయిక గా నటిస్తోంది. ఆగస్ట్ 12న ప్రపంచ వ్యా్ప్తంగా థియేటర్స్‌లో విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా వెన్నెల కిషోర్ (Vennela Kishore) కేరక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇగో కా బాప్ ‘గుంతలకిడి గురునాథం’ అలియాస్ గురు పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించబోతున్నట్టు పోస్టర్‌ను బట్టి అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. 


ఇంతకు ముందు ఇందులో విలన్‌గా నటిస్తున్న సముద్రఖని (Samudrakhani) ‘రాజప్ప’ పాత్రని పరిచయం చేస్తూ వదిలిన పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాలో హీరో నితిన్ ఐఏయస్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక రాజకీయ నాయకుడికి, ఒక యువ ఐఏయస్ అధికారికి మధ్య జరిగే ఆసక్తికరమైన పోరుగా ఈ సినిమా రూపొందిస్తుండగా.. ఇందులో ఎన్నికలు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అభిమానుల్ని అలరిస్తాయని నిర్మాతలు చెబుతున్నారు. అలాగే ఇందులోని పోరాట సన్నివేశాలు కూడా మెప్పిస్తాయని తెలుస్తోంది. ‘చెక్, రంగ్‌దే, మాస్ట్రో’ చిత్రాలతో వరుసగా పరాజయాలు చవిచూసిన నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా కచ్చితంగా తనకి మంచి హిట్టిస్తుందని నమ్ముతున్నాడు. 



Updated Date - 2022-07-20T22:25:38+05:30 IST