Victory Venkatesh : నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు?

ABN , First Publish Date - 2022-05-29T16:35:15+05:30 IST

విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) గతేడాది ఓటీటీలో ‘నారప్ప (Narappa), దృశ్యం 2 (Drishyam 2 )’ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ‘ఎఫ్ 3’ (F3) చిత్రంతో నవ్వులు పూయిస్తున్నాడు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ (F2) చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సైతం హిలేరియస్ గా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

Victory Venkatesh : నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు?

విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) గతేడాది ఓటీటీలో ‘నారప్ప (Narappa), దృశ్యం 2 (Drishyam 2)’ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ‘ఎఫ్ 3’ (F3) చిత్రంతో నవ్వులు పూయిస్తున్నాడు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో సూపర్ హిట్  ‘ఎఫ్ 2’ (F2)  చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సైతం హిలేరియస్ గా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి తొలి రోజు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతమైంది. ఈ సినిమాతో వెంకీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్టే అని అంటున్నారు. రేచీకటి బలహీనతో థియేటర్స్ లో పొట్టచెక్కయ్యేలా నవ్విస్తున్నాడు వెంకీ. అలాగే.. నత్తితో బధపడే యువకుడిగా సందడి చేస్తున్నాడు వరుణ్. ఇక దీని తర్వాత వెంకీ ఏ సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వెంకీ హీరోగా రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ రెండూ మైత్రీ, సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మాణం జరుపుకోనున్నాయి. అయితే ఈ సినిమాల్ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.


తాజా సమాచారం ప్రకారం ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవీ (Anudeep KV) దర్శకత్వంలో వెంకీ నటించబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అనుదీప్ చెప్పిన ఓ కథకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని త్వరలోనే సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) వారు నిర్మించబోతున్నారు. అనుదీప్ ప్రస్తుతం శివకార్తికేయన్ (Shiva Karthikeyan) తో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత అనుదీప్ చేయబోయేది వెంకీతోనే అని సమాచారం. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వెంకీ మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు . కానీ దర్శకుడు ఇంకా ఫైనలైజ్ కాలేదు. ‌‌


ఇక వెంకీ ఈ ఏడాది బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ (Kabhi Eed Kabhi Deewali) చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర పోసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో త్వరలో వెంకీ ఎంటర్ కానున్నాడు. కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తి కానుంది. మరో పక్క రానాతో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం ‘రానానాయుడు’ (Rananaidu)వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు వెంకీ. ఇది కూడా త్వరలో పూర్తికానుంది. వచ్చే ఏడాది ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 

Updated Date - 2022-05-29T16:35:15+05:30 IST