Simbu: సినిమా సంచలన విజయం.. హీరోకు ఖరీదైన బాహుమతి..

ABN , First Publish Date - 2022-09-26T00:24:40+05:30 IST

‘మానాడు’ విజయంతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు హీరో శింబు (Simbu). ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో ‘వెందు తానింధదు కాడు’ (Vendhu Thanindhadhu Kaadu) లో నటించాడు.

Simbu: సినిమా సంచలన విజయం.. హీరోకు ఖరీదైన బాహుమతి..

‘మానాడు’ విజయంతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు హీరో శింబు (Simbu). ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో ‘వెందు తానింధదు కాడు’ (Vendhu Thanindhadhu Kaadu) లో నటించాడు. ‘గౌతమ్ వాసుదేవ్ మీనన్’ (Gautham Vasudev Menon) దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సంచలన విజయం సాధించింది. భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం విజయం సాధించడంతో నిర్మాత ఇశారీ గణేశ్ (Ishari Ganesh) ఉబ్బితబ్బిబయ్యాడు. చిత్ర బృందానికి సక్సెస్ పార్టీ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా శింబుకు ఖరీదైన కారును బాహుమతిగా ఇచ్చాడు. గౌతమ్ మీనన్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకును గిఫ్ట్‌గా అందించాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శింబు అభిమానులు విపరీతంగా ఈ పిక్స్‌ను షేర్ చేస్తున్నారు. 


వెందు తానింధదు కాడు సినిమా తెలుగులో ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ టైటిల్‌తో విడుదలయ్యింది. విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు కథను జయమోహన్ అందించాడు. ఏఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆంథొనీ ఎడిటర్‌గా సేవలు అందించాడు. సిద్ధి ఇద్నానీ, రాధికా శరత్ కుమార్, సిద్దిఖీ, నీరజ్ మాధవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కోలీవుడ్‌లో ఈ మూవీ విజయం సాధించడంతో సీక్వెల్ తీస్తున్నట్టు గౌతమ్ మీనన్ గతంలోనే ప్రకటించాడు. కథను సిద్ధం చేస్తున్నట్టు తెలిపాడు. ముంబైలోని డాన్‌లకు డాన్‌గా శింబు కనిపిచనున్నాడని పేర్కొన్నాడు. ఇక శింబు కెరీర్ విషయానికి వస్తే.. కృష్ణ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాలో అండర్ వరల్డ్ డాన్‌ పాత్రను పోషించనున్నాడు. శాండల్‌వుడ్ హిట్ మూవీ ‘మఫ్టీ’ కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. 



Updated Date - 2022-09-26T00:24:40+05:30 IST