Varun Dhawan: నా భార్యకి ఇంకా నా ఇల్లు.. తన ఇల్లు అనే భేదం ఉంది..

ABN , First Publish Date - 2022-06-20T14:36:17+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో వరుణ్ ధావన్ ఒకరు. కరణ్ జోహార్ దర్శకత్వంలో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ సినిమాతో..

Varun Dhawan: నా భార్యకి ఇంకా నా ఇల్లు.. తన ఇల్లు అనే భేదం ఉంది..

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో వరుణ్ ధావన్ ఒకరు. కరణ్ జోహార్ దర్శకత్వంలో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వరుణ్ తాజాగా నటించిన చిత్రం ‘జగ్ జగ్ జీయో’. కుటుంబ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో కియారా అడ్వాణీ హీరోయిన్. రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, నీతూ కపూర్ ముఖ్యపాత్రల్లో పోషించారు. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఈ మూవీ టీం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన నిజ జీవితంలో రిలేషన్‌షిప్‌ల గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.


వరుణ్ మాట్లాడుతూ.. ‘నేను చాలా సాధారణ వ్యక్తిని. అందుకే అందరితోనూ ఎంతో ఈజీగా కలిసిపోతుంటాను. ఓపిక, బాధ్యతతో ఉండడం వల్ల ఆ బంధాలన్నీ దీర్ఘకాలం సాగుతుంటాయి. పెరెంట్స్‌తో కూడా అలాగే ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. అలాగే నటాషా దలాల్‌తో పెళ్లి తర్వాత జీవితం గురించి ఈ యువ నటుడు మాట్లాడుతూ.. ‘పెళ్లి జీవితం చాలా అమేజింగ్‌గా ఉంది. నటాషా, నేను చాలా సంతోషంగా ఉన్నాం. ఈ అనుభూతి చాలా గొప్పగా ఉంది. తనలాంటి మంచి భార్యకి ఓ మంచి భర్తగా ఉండడం నా బాధ్యత. అలాగే.. తను నా పనిని, నా నటనని పొగుతూ ఉంటుంది. దాంతోపాటు అప్పుడప్పుడూ విమర్శిస్తూ ఉంటుంది. అదే నన్ను తగ్గి ఉండేలా చేస్తుంది.


అయితే.. పెళ్లి తర్వాత నాలో ఎటువంటి మార్పు రాలేదు. నటాషాలోనూ ఎటువంటి మార్పు లేదు. మా ఇంటికి దగ్గరలోనే తన తల్లిదండ్రుల ఇల్లు ఉంటుంది. అప్పుడప్పుడూ షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది కదా. అప్పుడు కాల్ చేసి ఎక్కడ ఉన్నావని అడిగితే నా ఇంట్లో ఉన్న అని, తన తల్లిదండ్రుల ఇంటి గురించి చెబుతుంది. అది వినప్పుడు నా భార్యకి నా, తన ఇల్లు అనే భావన ఇంకా పోలేదని అనిపిస్తుంది’ అని నవ్వుతూ తెలిపాడు. అంతేకాకుండా నటాషానే తన సినిమాకి పెద్ద విమర్శకురాలని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-06-20T14:36:17+05:30 IST