ఆ డిజిటల్ ప్లాట్‌ఫాంలోనే Jugjugg Jeeyo స్ట్రీమింగ్.. ఎప్పటి నుంచంటే..?

ABN , First Publish Date - 2022-07-15T20:51:14+05:30 IST

వరుణ్ ధావన్ (Varun Dhawan), కియారా అడ్వాణీ (Kiara Advani) హీరో, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘జుగ్‌జుగ్ జీయో’ (Jugjugg Jeeyo). నీతూ కపూర్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్

ఆ డిజిటల్ ప్లాట్‌ఫాంలోనే Jugjugg Jeeyo స్ట్రీమింగ్.. ఎప్పటి నుంచంటే..?

వరుణ్ ధావన్ (Varun Dhawan), కియారా అడ్వాణీ (Kiara Advani) హీరో, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘జుగ్‌జుగ్ జీయో’ (Jugjugg Jeeyo). నీతూ కపూర్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ నిర్మించాడు. ప్రపంచవ్యాప్తంగా  ఈ సినిమా జూన్ 24న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా దాదాపుగా రూ. 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను థియేటర్స్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెర పడినట్టే కనిపిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.  


‘జుగ్ జుగ్ జీయో’ డిజిటల్ హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ దక్కించునట్టు తెలుస్తోంది. ఈ మూవీ జులై 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ధర్మ ప్రొడక్షన్స్ నుంచి రాబోయే మూడు సినిమాలు అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు కరణ్ జోహార్ గతంలోనే తెలిపాడు. ‘జుగ్ జుగ్ జీయో’తో పాటు ‘గోవిందా నామ్ మేరా’, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంలోనే అందుబాటులోకి రానున్నట్టు చెప్పాడు.

Updated Date - 2022-07-15T20:51:14+05:30 IST