Varasudu: డిజిటల్ రైట్స్ వారికేనా..?

ABN , First Publish Date - 2022-07-30T15:42:52+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న మొదటి తెలుగు స్ట్రైట్ మూవీ ‘వారసుడు’ (Varasudu). తమిళంలో ‘వారిసు’గా తెరకెక్కుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని

Varasudu: డిజిటల్ రైట్స్ వారికేనా..?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న మొదటి తెలుగు స్ట్రైట్ మూవీ ‘వారసుడు’ (Varasudu). తమిళంలో ‘వారిసు’గా తెరకెక్కుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తాజా సమాచారం. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేయగా, అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. 


రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) శిరీష్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 



అయితే, తాజా సమాచారం మేరకు విజయ్ ‘వారసుడు’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో మేకర్స్ నుంచి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ కూడా రాబోతుందట. తమిళంలో విజయ్ కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలు ఇప్పటి వరకు తెలుగులో అనువాదాలుగా వచ్చి ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో త్వరలో రాబోతున్న విజయ్ తెలుగు స్ట్రైట్ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. 

Updated Date - 2022-07-30T15:42:52+05:30 IST