టాలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో హీరో Satya మృతి

ABN , First Publish Date - 2022-06-03T22:22:02+05:30 IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయమై.. ఆ తర్వాత ‘వరం’ (Varam) అనే సినిమాతో హీరోగా పరిచయమైన సత్య (Satya) అనే నటుడు గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి..

టాలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో హీరో Satya మృతి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయమై.. ఆ తర్వాత ‘వరం’ (Varam) అనే సినిమాతో హీరోగా పరిచయమైన సత్య (Satya) అనే నటుడు గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సత్య.. తనకున్న బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో.. కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. సత్యని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన మృతిచెందినట్లుగా ధృవీకరించారు. సత్య మృతి వార్తను ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడిస్తూ.. శుక్రవారం హైదరాబాద్ ఈఎస్ఐ శ్మశాన వాటికనందు అంత్యక్రియలను నిర్వహించనున్నామని తెలియజేశారు. 


సత్య పూర్తి పేరు వి. రామసత్యనారాయణ (V Rama SatyaNarayana). ఆయన తండ్రి పేరు రెడ్డప్పచారి (Reddappa Chary). క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని చిత్రాలలో నటించిన సత్య.. ‘వరం’, ‘బ్యాచ్‌లర్స్’ (Bachelors) అనే చిత్రాలలో ప్రధాన పాత్రలో నటించారు. ఆ రెండు చిత్రాలు నటుడిగా ఆయనకు సరైన గుర్తింపును ఇవ్వకపోవడంతో.. ఆ తర్వాత నటనకు స్వస్తి పలికి.. బిజినెస్‌పై దృష్టిపెట్టారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో.. కరోనా (Corona) సెకండ్ వేవ్‌ దెబ్బకి అతని జీవితం తారుమారైంది. ఆ సమయంలో వెంటవెంటనే తన భార్యని (16 మే, 2021), తల్లిని (20 మే, 2021)ని కోల్పోయారు. అప్పటి నుండి మానసిక క్షోభను ఎదుర్కొంటున్న సత్య.. సడెన్‌గా ఇప్పుడు గుండెపోటుకు గురయ్యారు. ఆయనకు ఎనిమిదేళ్ల కుమార్తె రిత్విక (Rithvika) ఉంది. సత్య మరణవార్త తెలిసిన సన్నిహితులు,  శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం తెలుపుతున్నారు.

Updated Date - 2022-06-03T22:22:02+05:30 IST