Varalaxmi Sarathkumar... దూసుకెళ్లిపోతోంది

ABN , First Publish Date - 2022-09-14T01:56:19+05:30 IST

సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ (Sarath Kumar) కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసి.. వెండితెరపై తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar). కంటెంట్

Varalaxmi Sarathkumar... దూసుకెళ్లిపోతోంది

సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ (Sarath Kumar) కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసి.. వెండితెరపై తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar). కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ విభిన్నమైన పాత్రలతో స్పెషల్ క్రేజ్‌ తెచ్చుకుంటోంది. పాజిటివ్ రోల్స్‌తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తూ తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఆమెకిప్పుడు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆమె సినిమా కోసం వేచి చూసే వారున్నారు. అంతలా వరలక్ష్మీ టాలీవుడ్‌లో దూసుకెళ్లిపోతోంది. టాలీవుడ్ ప్రేక్షకులు ఆమె నటనకు కనెక్ట్ అయిపోయారు. ప్రస్తుతం టాలీవుడ్‌కి మకాం మార్చేసేలా.. ఆమెకు ఇక్కడ అవకాశాలు వరిస్తున్నాయి. త్వరలో రెండు భారీ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అంతకంటే ముందు ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘చేజింగ్’ (Chasing) చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది.


ఇప్పటికే కోలీవుడ్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘చేజింగ్’ చిత్రాన్ని.. ‘ఒరేయ్ బామ్మర్ది, మై డియర్ భూతం’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఏఎన్ బాలాజీ (AN Balaji)  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌‌పై.. అదే పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానుంది. కె. వీరకుమార్ (K Veera Kumar) ఈ చిత్రానికి దర్శకుడు. మదిలగన్ మునియాండి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ్‌లో ఈ సినిమా ఎలాగైతే విజయం సాధించిందో..  తెలుగులో కూడా ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఇందులో వరలక్ష్మీ పోలీసాఫీసర్ గెటప్‌లో కనిపించనుంది. ఈ సినిమా టాలీవుడ్‌లో మంచి సక్సెస్ అయితే మాత్రం.. ఆమెతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడటం కాయం. 



Updated Date - 2022-09-14T01:56:19+05:30 IST