Samantha విడాకుల వ్యవహారంపై స్పందించిన Vanitha Vijaykumar!

ABN , First Publish Date - 2021-10-11T17:36:37+05:30 IST

దాదాపు నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా వైవాహక జీవితం గడిపిన టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత అందరికీ ఊహించని షాకిచ్చారు.

Samantha విడాకుల వ్యవహారంపై స్పందించిన Vanitha Vijaykumar!

దాదాపు నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితం గడిపిన టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత అందరికీ ఊహించని షాకిచ్చారు. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. చై-సామ్ విడాకుల వ్యవహారంపై సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా సమంతపై ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. 


వారిందరికీ సమంత సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చింది. విడాకుల వ్యవహారంలో అనవసరంగా తనను వేధించవద్దని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై తమిళ నటి వనితా విజయ్ కుమార్ స్పందించింది. సమంతకు మద్దతుగా నిలిచింది. `సమాజం అనేది అవాస్తవం సమంత. దానిని పట్టించుకోనవసరం లేదు. నీ బతుకు నువ్వు బతుకు. జీవితం అనేది చాలా విలువైనది. జరిగే ప్రతి విషయం వెనుక ఓ కారణం ఉంటుంది. ధైర్యంగా ముందుకెళ్లు. నీకు మరింత బలం చేకూరాల`ని వనిత కామెంట్ చేసింది. 

Updated Date - 2021-10-11T17:36:37+05:30 IST