Adipurush : మరో వివాదం.. ప్రభాస్‌కు ముందే తెలుసు

ABN , First Publish Date - 2022-10-07T03:01:52+05:30 IST

ఆ రాముడు కాపీ! ప్రభాస్‌కు ముందే తెలుసు ఆదిపురుష్‌పై మరో వివాదం వానరసేన స్టూడియోస్‌ అధినేత ఇంటర్వ్యూ

Adipurush : మరో వివాదం.. ప్రభాస్‌కు ముందే తెలుసు

ఆ రాముడు కాపీ!

ప్రభాస్‌కు ముందే తెలుసు

ఆదిపురుష్‌పై మరో వివాదం

వానరసేన స్టూడియోస్‌ అధినేత ఇంటర్వ్యూ(Adipurush poster issue)


ఆదిపురుష్‌పై మరో వివాదం రాజుకుంటోంది. ప్రభాస్‌ను (prabhas)రాముడిగా చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్‌ను కాపీ కొట్టారని ముంబాయికి చెందిన వానరసేన స్టూడియోస్‌ పేర్కొంటోంది. ఈ చిత్రంపై తమకే కాపీరైట్స్‌ ఉన్నాయని స్పష్టం చేస్తోంది. తమ చిత్రాన్ని ప్రభాస్‌ గతంలో తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేశాడని కూడా పేర్కొంటోంది. ఈ వివాదానికి సంబంధించిన అంశాలను వానరసేన స్టూడియోస్‌ వివేక్‌ రామ్‌ (Vivek ram - Vanarasena studios) చిత్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 


మీరు పెట్టిన ట్విట్టర్‌ పోస్ట్‌లో రెండు బొమ్మల మధ్య పోలిక ఉంది. కానీ దీనిని కాపీ అని ఎలా చెబుతాం?

శ్రీరాముడిని ఒక విలుకాడుగా చూపించటం కోసం రూపొందించిన చిత్రమిది. దీని కోసం మేము చాలా కాలం రీసెర్చ్‌ చేశాం. 14 ఏళ్ల క్రితం దీనిని రూపొందించాం.  శ్రీరాముడిని ఈ తరహా విలుకాడుగా ఏ ఇతర కామిక్స్‌లో కానీ చిత్రాలలో కానీ చూపించలేదు. మా చిత్రంలో వేళ్లు ఎలా ఉన్నాయనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ చిత్రానికి చాలా ప్రశంసలు వచ్చాయి. ఈ తరహా చిత్రం వేరొకటి లేదు. అందువల్ల ఆదిపురుష్‌ పోస్టర్‌ను చూసిన వెంటనే కాపీ అని గుర్తించగలిగాం. 


ఈ చిత్రానికి కాపీరైట్‌ ఏదైనా ఉందా?

దీనిని 2008లో ఆన్‌లైన్‌లో పబ్లిష్‌ చేశాం. దానిపై నా పేరు కూడా స్పష్టంగా ఉంటుంది. 


సినీ రంగంలో ఈ తరహా వార్తలు కనిపిస్తూ ఉంటాయి. మీ చిత్రాన్ని కాపీ కొట్టారని ఎలా నమ్మాలి?

నా కన్నా ముందు ఎవరూ ఈ తరహా చిత్రాన్ని గీయలేదు. ఈ చిత్రానికి చాలా ప్రశంసలు వచ్చాయి కాబట్టి చిత్ర బృందం అలాంటి ప్రశంసలనే కోరుకొని ఉండచ్చు. కొన్నేళ్ల క్రితం ప్రభాస్‌ దసరా రోజున ఫేస్‌బుక్‌లో నా చిత్రాన్ని షేర్‌ చేశారు. అంటే చిత్ర బృందానికి నా చిత్రం ఉందని తెలుసు. 


ఆదిపురుష్‌ టీమ్‌ ఇప్పటి దాకా మిమల్ని కాంటాక్ట్‌ చేశారా?

లేదు. 







Updated Date - 2022-10-07T03:01:52+05:30 IST