Valli Mayil: ఆకట్టుకుంటున్న ఫరియా ఫస్ట్ లుక్..

ABN , First Publish Date - 2022-06-21T22:07:46+05:30 IST

‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది యంగ్ బ్యూటీ ఫరియా అబ్ధుల్లా (Faria Abdullah). తాజాగా తను నటిస్తున్న కొత్త చిత్రం నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది.

Valli Mayil: ఆకట్టుకుంటున్న ఫరియా ఫస్ట్ లుక్..

‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది యంగ్ బ్యూటీ ఫరియా అబ్ధుల్లా (Faria Abdullah). తాజాగా తను నటిస్తున్న కొత్త చిత్రం నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. ‘జాతి రత్నాలు’ హిట్ తర్వాత వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుందని అందరూ చెప్పుకున్నారు. కానీ, అలాంటి అవకాశాలు అందుకోవడంలో జాతిరత్నం బాగా వెనకబడింది. తనతో పాటు హీరోయిన్‌గా పరిచయమైన కృతిశెట్టి (Krithi Setty), కేతిక శర్మ (Kethika Sharma) లాంటి కుర్ర భామలు వరుస చిత్రాలలో నటిస్తూ అసలు తీరిక లేకుండా గడుపుతున్నారు. ఫరియా మాత్రం కాస్త నెమ్మదిగా అడుగులు వేస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన బంగార్రాజు (Bangarraju) సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసి ఆకట్టుకుంది.


ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ (Raviteja) నటిస్తున్న రావణాసుర (Ravanasura) సినిమాలో కీలక పాత్రను పోషిస్తోంది. సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో తెరకెక్కుస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ కాబోతోంది. ఇక హీరోయిన్‌గా ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తుంది. ‘వల్లి మయిల్’ (Valli Mayil)  అనే టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతోంది. బిచ్చగాడు, సలీమ్, సైతాన్ లాంటి విభిన్న కథాంశాలతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం కానుంది ఫరియా. కాగా, నేడు తన పుట్టినరోజు. ఈ సందర్భంగా లేటెస్ట్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం వదిలింది. 


ఈ పోస్టర్‌లో ఫరియా అద్భుతంగా కనిపిస్తోంది. ‘వల్లి మయిల్’ (Valli Mayil) సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉండబోతుందని ఈ ఫస్ట్ లుక్‌తో తెలుస్తోంది. చూడాలి మరి ఒకేసారి ఇటు తెలుగులో, అటు తమిళంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఫరియా అబ్దుల్లా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో. ఇక ఈ సినిమాను సుశీంద్రన్ (Suseenthiran) తెరకెక్కిస్తున్నాడు. సునీల్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. డి ఇమాన్ సంగీత దర్శకుడు. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. 

Updated Date - 2022-06-21T22:07:46+05:30 IST