‘వకీల్‌సాబ్’: 2020లో 2వ స్థానం.. 2021లో 5వ స్థానం

ABN , First Publish Date - 2021-12-09T23:44:44+05:30 IST

2021 సంవత్సరానికిగానూ ట్విట్టర్‌ ఇండియాలో మోస్ట్‌ ట్వీటెడ్‌ మూవీస్‌ లిస్ట్‌ను ట్విట్టర్‌ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాల్లో తెలుగు సినిమా ‘వకీల్‌ సాబ్‌’ స్థ్థానం దక్కించుకుంది. టాప్ 5లో టాలీవుడ్ నుండి స్థానం దక్కించుకున్న చిత్రం ఇదే కావడం

‘వకీల్‌సాబ్’: 2020లో 2వ స్థానం.. 2021లో 5వ స్థానం

2021 సంవత్సరానికిగానూ ట్విట్టర్‌ ఇండియాలో మోస్ట్‌ ట్వీటెడ్‌ మూవీస్‌ లిస్ట్‌ను ట్విట్టర్‌ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాల్లో తెలుగు సినిమా ‘వకీల్‌ సాబ్‌’ స్థ్థానం దక్కించుకుంది. టాప్ 5లో టాలీవుడ్ నుండి స్థానం దక్కించుకున్న చిత్రం ఇదే కావడం విశేషం. మరో విశేషం ఏమిటంటే.. 2020లోనూ ‘వకీల్‌సాబ్’ ఈ జాబితాలో స్థానం దక్కించుకోవడం. 2020లో 2వ స్థానాన్ని దక్కించుకుంటే.. 2021లో ‘వకీల్‌సాబ్’ చిత్రం 5వ స్థానం పొంది.. వరుసగా రెండు సంవత్సరాలు టాప్ 5 జాబితాలో ఉన్న టాలీవుడ్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.


కాగా, ఈ సంవత్సరం ట్విట్టర్ ఇండియా విడుదల చేసిన మోస్ట్‌ ట్వీటెడ్‌ మూవీస్‌ లిస్ట్‌‌లో విజయ్ ‘మాస్టర్’ చిత్రం మళ్లీ మొదటి స్థానాన్ని(2020లోనూ మొదటి స్థానమే) కైవసం చేసుకోగా..  అజిత్‌ ‘వాలిమై’ రెండో స్థానం, విజయ్‌ ‘బీస్ట్‌’ మూడవ స్థానం, సూర్య ‘జై భీమ్‌’ నాలుగో స్థానంలో నిలిచాయి. మొదటి నాలుగు స్థానాల్లో కోలీవుడ్‌ చిత్రాలే ఉండగా.. ఐదో స్థానంలో పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ నిలిచింది. ‘మాస్టర్’ చిత్రం వరుసగా రెండు సంవత్సరాలు టాప్ ప్లేస్‌ని కైవసం చేసుకుంటే.. హీరో సూర్య చిత్రాలు ‘సూరారై పొట్రు’ 2020లో, ‘జై భీమ్’ 2021లో టాప్ 5లో ఉండటం గమనార్హం.



Updated Date - 2021-12-09T23:44:44+05:30 IST