VT 04: రాముడు కాదప్పా రావణుడు కొలిసే రుద్రకాళేశ్వరుడు

ABN , First Publish Date - 2022-06-22T19:13:32+05:30 IST

ఇది మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటిస్తున్న లేటెస్ట్ మూవీ నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ డైలాగ్ టీజర్‌లోనిది. తాజాగా చిత్రబృందం ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది.

VT 04: రాముడు కాదప్పా రావణుడు కొలిసే రుద్రకాళేశ్వరుడు

'రేయ్ రాముడు లంకమీద పడ్డం వినుంటావ్..

అదే పది తలకాయాలోడు ఇంటిమీద పడితే ఎట్టుంటాదో సూస్తావా? 

నీ అయోధ్యలో వుండేడిది రాముడు కాదప్పా.. 

ఆ రావణుడే కొలిసే రుద్రకాళేశ్వరుడు..

తలలు కోసి సేతికిత్తా నాయాలా...సూసుకుందాం రా...'




ఇది మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటిస్తున్న లేటెస్ట్ మూవీ నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ డైలాగ్ టీజర్‌లోనిది. తాజాగా చిత్రబృందం ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. వైష్ణవ్ మొదటి సినిమా 'ఉప్పెన' (Uppena) భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డెబ్యూ హీరోగా టాలీవుడ్, బాలీవుడ్‌లో 25 ఏళ్ళ నుంచి ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత  వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ (Krish) దర్శకత్వంలో 'కొండపొలం' (Kondapolam) సినిమా వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దాంతో తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. 


ఇప్పటికే తన మూడవ సినిమాగా 'రంగ రంగ వైభంగా' (Ranga Ranga Vaibhavanga) చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా తన నాలుగో సినిమాను ప్రకటించారు. పక్కా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుండగా, ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి (Srikanth Reddy) అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ (PDV Prasad) సమర్పణలో ఎంటర్‌టైన్మెంట్స్ (Sitara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ (Nagavamsi) స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) సతీమణి సాయి సౌజన్య కలిసి ఈ నిర్మిస్తున్నారు. 


కాగా, అధికారికంగా ప్రకటించిన ఈ మూవీ నుంచి డైలాగ్ మోషన్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. వైష్ణవ్ తేజ్ చెబుతున్న ఈ డైలాగులు చూస్తే సినిమా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా రాబోతుందని అర్థమవుతోంది. రాయల సీమ నేపథ్యంలో చిత్ర కథ సాగుతుందని డైలాగులో ఉన్న యాసని బట్టి అర్థమవుతోంది. ఇక మోషన్ పోస్టర్‌లో రుద్రకాళేశ్వరుడి త్రిశూలం.. డైలాగ్ మోషన్ పోస్టర్ చివర్లో శివుడి వాహనమైన గోమాత పక్కన త్రిశూలం పట్టుకుని సీరియస్ లుక్‌తో వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్న తీరు ఇప్పటినుంచే సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. మొత్తానికి ఈసారి వైష్ణవ్ తేజ్ హెవీ యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2023, సంక్రాంతి రేస్‌లో తీసుకురాబోతున్నటు తాజా పోస్టర్‌లో వెల్లడించారు.  



Updated Date - 2022-06-22T19:13:32+05:30 IST