బట్టబయలైన కాంగ్రెస్ అందగాడి చిన్న నాటి సీక్రెట్!

ABN , First Publish Date - 2022-04-02T04:20:52+05:30 IST

సొషల్ మీడియాలో రైట్ వింగ్ నెటిజన్స్ ఆయన్ని రకరకాలుగా ట్రోల్ చేసినప్పటికీ, శశి థరూర్ ‘ఇంగ్లీష్’ మాత్రం... ‘ది బెస్ట్’ అనక తప్పదు. అయితే, శశి థరూర్‌కి ‘ఆంగ్లం’ ఒక్కటే వచ్చనుకుంటే పొరపాటే. ఆయనకి అభినయం కూడా వచ్చు మరి...

బట్టబయలైన కాంగ్రెస్ అందగాడి చిన్న నాటి సీక్రెట్!

కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాండ్సమ్ లీడర్‌గా అందరికీ తెలిసిన వారు శశి థరూర్. కేరళ నుంచీ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో కాలుపెట్టిన ఆయన రెగ్యులర్ కాంగ్రెస్ పొలిటీషన్స్ కంటే చాలా భిన్నం. సొషల్ మీడియాలో రైట్ వింగ్ నెటిజన్స్ ఆయన్ని రకరకాలుగా ట్రోల్ చేసినప్పటికీ, శశి థరూర్ ‘ఇంగ్లీష్’ మాత్రం... ‘ది బెస్ట్’ అనక తప్పదు. అయితే, శశి థరూర్‌కి ‘ఆంగ్లం’ ఒక్కటే వచ్చనుకుంటే పొరపాటే. ఆయనకి అభినయం కూడా వచ్చు మరి...


రాజకీయ నాయకులు రియల్ లైఫ్‌లో నటిస్తుంటారు. అది మనందరికీ తెలిసిందే. కానీ, రీల్ లైఫ్‌లో నటించే పొలిటీషన్స్ చాలా తక్కువగా ఉంటారు. అటువంటి అరుదైన కాంగ్రెస్ నాయకుల్లో ఒకరుగా మారారు శశి థరూర్. ఆయన చిన్న నాటి సీక్రెట్ ప్రస్తుతం బట్టబయలైపోయింది! ఫిల్మ్ రైటర్ వైభవ్ విశాల్... అలనాటి హిందీ నటి గీతా బాలి నటించిన ‘జైలర్’ సినిమా నుంచీ... ఓ స్టిల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో గీతా బాలి చేయిపట్టుకుని ఓ చైల్డ్ ఆర్టిస్ట్ మనకు కనిపిస్తాడు. అతను శశి థరూరేనంటూ సీక్రెట్ రివీల్ చేశారు వైభవ్ విశాల్! 


‘మాస్టర్ జ్ఞాన్’ అనే స్క్రీన్ నేమ్‌తో శశి థరూర్ చిన్ననాడు మొత్తం 9 చిత్రాల్లో నటించారట. హిందీ, మలయాళం రెండు భాషల్లోనూ ఆయన సత్తా చాటారని కూడా వైభవ్ వివరించారు. అయితే, ఇదంతా శశి థరూర్ దృష్టికి కూడా వచ్చింది. తన చిన్ననాటి సినిమా స్టిల్‌ని ఆయన కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తన చైల్డ్ హుడ్ సీక్రెట్ బయట పెట్టిన వైభవ్‌ని ట్యాగ్ చేస్తూ ‘‘నేను ఇంత కాలం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచటానికి ప్రయత్నించాను...’’ అన్నారు థరూర్. అంతే కాదు, చిన్నప్పుడు తాను ‘మాస్టర్ జ్ఞాన్’... ఇప్పుడు కూడా తనని అందరూ ‘మాస్టర్ జ్ఞాన్’ అనే అంటారు... అంటూ చమత్కరించారు కాంగ్రెస్ ఎంపీ! ఇక ఈ మొత్తం ట్విట్టర్ చర్చలో కొసమెరుపు ఏంటంటే... చాలా మంది నెటిజన్స్ శశి థరూర్ చిన్న నాటి హెయిర్ స్టైల్, ఇప్పటి హెయిర్ స్టైల్... అచ్చంగా ఒకేలా ఉన్నాయని కామెంట్స్ చేయటం!  

Updated Date - 2022-04-02T04:20:52+05:30 IST