Adipurush: ఫస్ట్‌లుక్ కాపీ అంటూ యానిమేషన్ స్టూడియో ఆరోపణలు

ABN , First Publish Date - 2022-10-06T21:39:51+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఆది‌పురుష్’ (Adipurush). ఓం రౌత్ (Om Raut) దర్శత్వం వహించాడు.

Adipurush: ఫస్ట్‌లుక్ కాపీ అంటూ యానిమేషన్ స్టూడియో ఆరోపణలు

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఆది‌పురుష్’ (Adipurush). ఓం రౌత్ (Om Raut) దర్శత్వం వహించాడు. కృతి సనన్ (Kriti Sanon)హీరోయిన్‌గా నటించింది. సైఫ్‌అలీ ఖాన్ (Saif Ali Khan) కీలక పాత్రను పోషించాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అక్టోబర్ 2న అయోధ్యలో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సెలబ్రిటీలు సైతం టజర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ‘ఆదిపురుష్’ మేకర్స్ తమ వర్క్‌ను కాపీ చేశారని వానర్ సేన స్టూడియో ఆరోపణలు గుప్పించింది. అందుకు సంబంధించిన పోస్టర్స్‌ను అభిమానులతో పంచుకుంది. తమకు గుర్తింపు ఇవ్వకపోవడం తప్పని పేర్కొంది. 


తాము రూపొందించిన లార్డ్ శివ పోస్టర్ నుంచే స్ఫూర్తి పొంది.. ఆదిపురుష్ ఫస్ట్‌లుక్‌కు రూపకల్పన చేశారని వానర్ సేన స్టూడియో చెప్పింది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మేం రూపొందించిన లార్డ్ శివ నుంచే స్ఫూర్తి పొంది ఆదిపురుష్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ డిజైన్ చేశారు. ఒరిజినల్ క్రియేటర్‌కు గుర్తింపు ఇవ్వకపోవడం బాధకరం’’ అని వానర్ సేన స్టూడియో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై అనేక మంది నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ‘‘స్ఫూర్తి పొందలేదు. పూర్తిగా కాపీ చేశారు’’ అని ఓ నెటిజన్ చెప్పారు. ‘‘కాపీ, పేస్ట్ చేశారు’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ పేర్కొన్నారు. ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైన‌ప్పటి నుంచి అభిమానులు పూర్తిగా నిరుత్సహానికి లోనయ్యారు. అందువల్ల సినిమాను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఈ ట్రోల్స్‌పై దర్శకుడు ఓం రౌత్ స్పందించాడు. 


‘ఆది‌పురుష్’ ను థియేటర్స్ కోసం నిర్మించామని, మొబైల్ ఫోన్స్ కోసం కాదని ఓం రౌత్ తెలిపాడు. ‘‘ఆది‌పురుష్ టీజర్‌కు వచ్చిన ప్రేక్షకుల స్పందన చూసి నేను బాధపడ్డాను. కానీ, అదే సమయంలో నేను ట్రోల్స్ చూసి సర్‌ప్రైజ్ కాలేదు. ఈ సినిమాను థియేటర్స్ కోసం నిర్మించాం. సినిమా హాల్స్‌లో వెండితెర పరిమాణాన్ని తగ్గించొచ్చు. కానీ, ఆ పరిమాణాన్ని మొబైల్‌ స్క్రీన్ కోసం తగ్గించకూడదు. నాకు కనుక అవకాశం వస్తే యూట్యూబ్‌లో టీజర్‌ను ఎప్పటికి రిలీజ్ చేయను. కానీ, ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావాలనే ఉద్దేశ్యంతో టీజర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశాం’’ అని ఓం రౌత్ తెలిపాడు. ఈ సినిమాను రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. రూ.500కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశ్‌గా సైఫ్ అలీ ఖాన్ నటించారు. 

Updated Date - 2022-10-06T21:39:51+05:30 IST