Nayanthara: యూవీకి నయనతార ‘కనెక్ట్’

ABN , First Publish Date - 2022-12-06T03:45:43+05:30 IST

నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కనెక్ట్’ (Connect). ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన యూవీ క్రియేషన్స్

Nayanthara: యూవీకి నయనతార ‘కనెక్ట్’

నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కనెక్ట్’ (Connect). ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన యూవీ క్రియేషన్స్.. తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో స్పెషలిస్ట్ అయినటువంటి అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి.


నయనతార నాయికగా అశ్విన్‌ శరవణన్‌ రూపొందించిన ‘మయూరి’ సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన ‘గేమ్ ఓవర్’ కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. కనెక్ట్ చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తుండటంతో.. వెంటనే తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే బాధ్యత యూవీ క్రియేషన్స్ తీసుకుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస వంటివారు కీలక పాత్రల్లో నటించారు.

Updated Date - 2022-12-06T03:45:43+05:30 IST