Aadipurush : తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు షాకింగ్ రేట్ !

ABN , First Publish Date - 2022-09-05T13:42:44+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘ఆదిపురుష్’ (Aadipurush) ఒకటి. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ఈ పౌరాణిక చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది.

Aadipurush : తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు షాకింగ్ రేట్ !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘ఆదిపురుష్’ (Aadipurush) ఒకటి. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ఈ పౌరాణిక చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రభాస్ రాముడిగానూ, కృతి సనన్ (Krithi Sanon) సీతగా నటిస్తుండగా.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny singh), రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ (Saif Alikhan) నటిస్తున్నారు. ఇంతకు ముందే టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకోగా.. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ నడుస్తోంది. రామాయణ ఇతిహాస కావ్యాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరించబోతున్నారు. చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. 


ఇక ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను యూవీ క్రియేషన్స్ (UV Creations) వారు అత్యధిక ధరకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఏకంగా రూ. 100 కోట్లకు కైవసం చేసుకున్నారట. ఒకవేళ చిత్రానికి మంచి టాక్ వస్తే యూవీ వారికి మంచి లాభాలు వస్తాయని వేరే చెప్పాలా? ప్రభాస్ గత చిత్రాలు ‘సాహో (Saho), రాధేశ్యామ్‌ (Radheshyam)’లకు భారీ నష్టాలొచ్చాయి. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని యూవీ క్రియేషన్స్ ‘ఆదిపురుష్’ చిత్రం తెలుగు రైట్స్ దక్కించుకోవడం గమనార్హం. ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా ‘ఆదిపురుష్’ నిలిచిపోనుంది. 


ఇప్పటికే జానపద జోనర్‌లో ‘బాహుబలి’ (Bahubali) సిరీస్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రభాస్.. ఇప్పుడు ‘ఆదిపురుష్’ చిత్రంతో పౌరాణిక జోనర్‌ను కూడా టచ్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా అదే స్థాయిలో మ్యాజిక్ చేస్తే ప్రభాస్‌కు ఇక తిరుగే ఉండదు. గతంలో యన్టీఆర్, శోభన్ బాబు, హరనాథ్ లాంటి మహానటులు శ్రీరాముడిగా జీవించి తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించారు. ఇప్పుడు అదే పాత్రలో ప్రభాస్ మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈ ఆదిపురుషుడు ఏ స్థాయిలో అభిమానుల్ని మైమరిపిస్తాడో చూడాలి. 

Updated Date - 2022-09-05T13:42:44+05:30 IST