Uttej: లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే వివాదం తీసుకొచ్చారు

ABN , First Publish Date - 2021-10-12T23:44:06+05:30 IST

‘‘సినిమా అన్న పదమే లోకల్‌ కాదు. అలాంటిది ‘మా’ ఎన్నికల్లో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే వివాదం తీసుకొచ్చారు’’ అని ఉత్తేజ్‌ అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి ఆఫీస్‌ బేరర్‌గా గెలిచిన ఆయన కూడా రాజీనామా చేశారు. ‘‘నా భార్య పద్మ కన్నుమూయడంతో ఎన్నికల్లో అంత యాక్టివ్‌గా పాల్గొనలేదు.

Uttej: లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే వివాదం తీసుకొచ్చారు

‘‘సినిమా అన్న పదమే లోకల్‌ కాదు. అలాంటిది ‘మా’ ఎన్నికల్లో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే వివాదం తీసుకొచ్చారు’’ అని ఉత్తేజ్‌ అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి ఆఫీస్‌ బేరర్‌గా గెలిచిన ఆయన కూడా రాజీనామా చేశారు. ‘‘నా భార్య పద్మ కన్నుమూయడంతో ఎన్నికల్లో అంత యాక్టివ్‌గా పాల్గొనలేదు. అయినా నాపై నమ్మకంతో ‘మా’ సభ్యులు ఓటేసి గెలిపించారు. బల్బును కనిపెట్టిన థామస్‌ ఆల్వా ఎడిసన్‌, సినిమాను ఇచ్చిన లూమియర్‌ బ్రదర్స్‌, ‘మాయాబజార్‌’ను గొప్పగా అందించిన మార్కస్‌ బాట్లేలకు నమస్కారం చేయాలి. ఎందుకంటే వీళ్లు లోకల్‌ కాదు. సినిమా అన్న పదమే లోకల్‌కాదు. అలాంటిది ‘మా’ ఎన్నికల్లో లోకల్‌, నాన్‌లోకల్‌ అన్న వివాదం తీసుకొచ్చారు. సినిమాను ఎంతోగానో ప్రేమించే ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ కోసం ఏదైనా చేయాలని వస్తే కొన్నేళ్లుగా పనిచేస్తున్న మేమంతా ఆయనతో కలిసి వచ్చాం. శివాజీరాజా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నరేశ్‌ జనరల్‌ సెక్రటరీగా ఉనారు. ఎన్నికలు జరిగే రోజున నన్ను అసభ్య పదజాలంతో తిట్టారు. గెలిచిన తర్వాత ‘మా’ భవనంలోకి వెళ్తే, థంబ్‌ వేసి వెళ్లాలన్నారు. అమెరికాలో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన లెక్కలు కరెక్ట్‌గా లేవని ఆరోపిస్తారా? పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల అధికారులకూ, అవతలి ప్యానల్‌ సభ్యులకు పసుపు రంగు కార్డులు ఇచ్చారు. నా 25ఏళ్ల కెరీర్‌లో బెనర్జీ అన్న ఏడవటం చూడలేదు. సోదరుడులాంటి విష్ణు ‘మా’ను బాగా నడిపించగలరు. మీ వెనుక మీ నాన్నగారు ఉన్నారు. ‘మా’ సభ్యులను కాపాడే ప్రయత్నం చేయండి’’ అని ఉత్తేజ్‌ ఆవేదనతో మాట్లాడారు. 


Updated Date - 2021-10-12T23:44:06+05:30 IST