Allu Sirish: ముద్దు మీద ముద్దులు!

ABN , First Publish Date - 2022-09-29T23:26:27+05:30 IST

‘‘కొన్ని విషయాలు మనం ఎంత ట్రై చేసినా జరగవు.. ఒక్కోసారి అనుకోకుండా జరిగిపోతాయి.. అలాంటప్పుడే అది మళ్లీ మళ్లీ జరిగితే బావుంటుందనిపిస్తుంటి’’ అంటూ అనూ ఇమ్యాన్యుయేల్‌కి ముద్దులు మీద ముద్దులు పెడతూ కనిపించారు అల్లు శిరీష్‌.

Allu Sirish: ముద్దు మీద ముద్దులు!

‘‘కొన్ని విషయాలు మనం ఎంత ట్రై చేసినా జరగవు.. ఒక్కోసారి అనుకోకుండా జరిగిపోతాయి.. అలాంటప్పుడే అది మళ్లీ మళ్లీ జరిగితే బావుంటుందనిపిస్తుంటి’’ అంటూ అనూ ఇమ్యాన్యుయేల్‌కి ముద్దులు మీద ముద్దులు పెడతూ కనిపించారు అల్లు శిరీష్‌. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఉర్వశివో రాక్షసివో’. ఈ చిత్రం టీజర్‌ను గురువారం విడుదల చేశారు. రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శిరీష్‌ సరసన అను ఇమ్మాన్యూల్‌ కథానాయికగా నటిస్తోంది. ఇందులో వీరిద్దరూ శ్రీకుమార్‌–సింధూ పాత్రల్లో కనిపిస్తారు. తాజాగా విడుదల చేసిన టీజర్‌ హాట్‌హాట్‌గా ఉంది. శిరీష్‌కు, అనూ ఇమ్మాన్యుయేల్‌కు మధ్య  కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తోంది. 


‘నువ్వు మామూలోడివి కాదు రాజా.. ఇంట్లోనేమో బుద్దిమాన్‌.. బయటేమో శక్తిమాన్‌..’ అంటూ పోసాని కృష్ణమురళీ చెప్పిన డైలాగ్‌, ‘అల్లుడూ కొద్దిగా టఫ్‌ మ్యాచ్‌ రా ఇది. జాగ్రత్తగా ఆడు’ అని సునీల్‌ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఎ2 పిక్చర్స్‌ పతాకంపై ధీరజ్‌ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. నవంబర్‌ 4న సినిమాను విడుదల చేయనున్నారు. 






Updated Date - 2022-09-29T23:26:27+05:30 IST