Urvashi Rautela: రిషబ్ పంత్‌కు సారీ.. మాట మార్చి షాకిచ్చిన బీ టౌన్ బ్యూటీ..

ABN , First Publish Date - 2022-09-15T02:14:02+05:30 IST

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela), టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కొంతకాలం ప్రేమయాణాన్ని కొనసాగించిన సంగతి తెలిసిందే. ఏమైందో తెలియదు కానీ, వారి బంధం ఎంతో

Urvashi Rautela: రిషబ్ పంత్‌కు సారీ.. మాట మార్చి షాకిచ్చిన బీ టౌన్ బ్యూటీ..

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela), టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కొంతకాలం ప్రేమయాణాన్ని కొనసాగించిన సంగతి తెలిసిందే. ఏమైందో తెలియదు కానీ, వారి బంధం ఎంతో కాలం నిలవలేదు. దీంతో వీరిద్దరి మధ్య పలు మార్లు సోషల్ మీడియాలో వార్ నడిచింది. ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు కూడా గుప్పించుకున్నారు. ఆర్‌పీ(రిషబ్ పంత్) తన కోసం హోటల్ లాబీలో వేచి చూశాడని ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై రిషబ్ పంత్ సోషల్ మీడియాలో స్పందించాడు. ‘‘ఇంటర్వ్యూల్లో సెలబ్రిటీలు అబద్ధాలు ఆడుతున్నారు’’ అని ఎవరి పేరును ప్రస్తావించకుండా రిషబ్ పంత్ పోస్ట్ పెట్టాడు. ఈ సోషల్ మీడియా వార్ పలు మార్లు కొనసాగింది. అయితే, బీ టౌన్ నటి తాజాగా రిషబ్ పంత్‌‌కు ‘సారీ’ చెప్పింది. ఒక్క రోజు కూడా గడవక ముందే.. తాను సారీ చెప్పింది పంత్‌కు కాదని ఫ్యాన్స్‌కు అని ఊర్వశి షాకిచ్చింది.    


ఊర్వశి రౌతేలా తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. రిషబ్ పంత్‌కు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడగగా స్పందించింది. మొదట సమాధానం చెప్పడానికి సంకోచించింది. ‘‘సారీ.. ఐ యామ్ సారీ ’’ అని ఊర్వశి తెలిపింది. ఆ మాట చెప్పి ఒక్క రోజు కూడా గడవక ముందే మాట మార్చింది. తాను సారీ చెప్పంది ఫ్యాన్స్‌కు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మూవీస్, టీవీషోల కంటే న్యూస్ ఆర్టికల్స్‌కు కొంతమంది అద్భుతంగా స్క్రిఫ్ట్ వర్క్ చేస్తున్నారు. నా ప్రియమైన ఫ్యాన్స్‌కు నేను సారీ చెప్పాను’’ అని ఊర్వశి ఇన్‌స్టాలో పోస్ట్‌ను షేర్ చేసింది. అప్పట్లో వీరిద్దరి మధ్య  జరిగిన ఓ ఘటన గురించి కొన్ని రోజుల క్రితం ఊర్శశి మీడియాకు చెప్పింది. ‘‘నేను వారణాసి, న్యూ డిల్లీలో పగలు, రాత్రి లేకుండా ఫుల్‌డే షూటింగ్‌ చేశాను. అందువల్ల అలసిపోయాను. నిద్రపోయాను. అప్పుడు ఆర్‌పీ(రిషబ్ పంత్) నా కోసం హోటల్ లాబీలో చాలా సేపు వేచి చూశాడు. నేను నిద్ర లేచే సరికి 16 నుంచి 17మిస్డ్ కాల్స్ ఉన్నాయి’’ అని ఊర్శశి పేర్కొంది. అప్పుడు రిషబ్ పంత్ రిప్లై ఇచ్చాడు. ‘‘పాపులారిటీ కోసం కొంత మంది ఇంటర్వ్యూల్లో అబద్ధాలు చెబుతున్నారు. పేరు, ప్రఖ్యాతల కోసం వారు వెంపర్లాడం చూస్తుంటే నవ్వొస్తుంది’’ అని పంత్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ పట్టగానే ఊర్వశి షూటుగా స్పందించింది. ‘‘చోటు భయ్యా బ్యాట్, బాల్‌తో ఆడుకోవాలి. నువ్వు అపనిందలు మోపడానికి నేను చిన్నపిల్లను కాదు’’ అని ఊర్శశి స్పష్టం చేసింది.    






Updated Date - 2022-09-15T02:14:02+05:30 IST